దేశంలోని అవినీతిని, నల్లధనాన్ని పారద్రోలేందుకు పెద్దనోట్ల రద్దు చేస్తూ తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అందుకు దేశప్రజలు 50 రోజుల పాటు కొంత సహనంతో, సంయమనంతో వేచి వుండాలని ఆ తరువాత డబ్బు లావాదేవీలన్నీ సులువవుతాయని చెప్పిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ.. అంతలోనే మాట మార్చి క్యాష్ లెస్ ఏకానమీ, డిజిటల్ మనీ అంటూ ప్లేటు ఫిరాయిండం వెనుకనున్న ముసుగును తాము తొలిస్తామన్న అందోళనతోనే అధికార పార్టీ ఎంపీలు పార్లమెంటును సజావుగా సాగనీయడం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, యువనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రజలకు నీతిసూక్తులు చెబుతున్న ప్రధాని నరేంద్రమోడీ.. చేస్తున్నది మాత్రం పెద్ద అవినీతని అరోపించారు. పెద్ద నోట్ల రద్దు వెనుక దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అతిపెద్ద కుంభకోణానికి ప్రధాని తెరతీశారని ఆయన అరోపించారు. స్వయంగా ప్రధాన మంత్రిని టార్గెట్ చేసిన రాహుల్.. ఆయనపై తీవ్రమైన అరోపణలను సంధించారు. ప్రధాని నీతి పేరుతో అవినీతి కుంభకోణానికి తెరలేపారని, ఇందుకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం తమ వద్దనుందని.. దానిని పార్లమెంటులో బయటపెడతామని చెప్పారు.
తనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం తన వద్ద ఉందని తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోడీ, ఆ సమాచారాన్ని తాను లోక్సభలో ప్రవేశపెట్టనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారని, ఆ సమాచారం తనవద్ద ఉండటంతో ఆయన భయకంపితులవుతున్నారని అన్నారు. మోదీ అవినీతిని ముసుగును తామెక్కడ బయట పెడతామోనని సభలో అధికారపక్షం సభ్యులు తమను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పార్లమెంటు సమావేశాలను అధికారపక్షమే అడ్డుకోవడం పార్లమెంటు చరిత్రలో నూతనోధ్యాయంగా మారిందని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుతో ఆయన లక్షలాది మంది ప్రజల ఉపాధిని ధ్వంసం చేశారని, ఇందుకుగాను ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ అవినీతికి సంబంధించిన తనవద్ద పక్కా సమాచారం, పూర్తి సమాచారం ఉందని రాహుల్ అన్నారు. ఆ సమాచారాన్ని లోక్సభలో ప్రవేశపెట్టనివ్వకుండా అడ్డుకుంటున్నారని, తాను పార్లమెంటు సభ్యుడినని, తనకు సభలో మాట్లాడే హక్కు ఉందని అన్నారు. ప్రజల్లోకి వెళ్లి తనను లోక్ సభలో విపక్షాలు అడ్డుకుంటున్నాయని, అందుకనే జన సభల్లో మాట్లాడుతున్నానని సానుభూతి పొందే మాట్లలతో తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మోడీ యత్నిస్తున్నారని విమర్శించారు.
సభ నిర్వహణ విషయంలో ప్రధాని అబద్ధాలు మాట్లాడుతున్నారని, నోట్లరద్దుపై బేషరతుగా పార్లమెంటులో చర్చకు తాము సిద్ధంగా ఉన్నా.. అధికారపక్ష సభ్యులే లేచినిలబడి సభను అడ్డుకుంటున్నారని, దేశ పార్లమెంటు చరిత్రలోనే అధికార పక్షం సభను అడ్డుకోవడం ఇదే తొలిసారి అని రాహుల్ ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాల నిర్వహణ విషయంలో ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more