మరికోన్ని రోజులు ఏటీయం వెక్కిరించనున్నాయ్.. Longer wait for cash, ATMs may turn dry

Longer wait for cash atms may turn dry

Demonetisation, Cash withdrawal, 50 days of demonetisation, Long queues at banks, Long queues at ATMs, Social media, Hardships faced by people, Helplessness, Poor, Farmers, Daily wage workers, Crying for own money, Narendra Modi, Black money, Demonetisation woes

ATMs across the country may dry up in the next couple of days as banks are yet to get cash from the Reserve Bank of India (RBI) and are left with limited currency stock.

మరికోన్ని రోజులు ఏటీయం వెక్కిరించనున్నాయ్..

Posted: 12/15/2016 08:55 PM IST
Longer wait for cash atms may turn dry

కరెన్సీ కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇప్పట్లో కష్టాలు తీరేలాలేవు. కరెన్సీ నోట్ల రద్దు చేసే క్రమంలో అనేక పర్యాయాలు చర్చించి.. ఆ తరువాతే నిర్ణయం తీసుకున్నామని భారతీయ రిజర్వు బ్యాంకు అధికారులు చెబుతున్నా.. ఈ మేరకు ఏ రకమైన ఎక్సర్సైజ్ చేసినట్లు మాత్రం కనిపించడం లేదు. అత్యంత గోప్యంగా వుండాల్సిన రెండు వేల రూపాయల కరెన్సీ నోటు వ్యవహారం కాస్తా అలా అలా మీడియాలోకి రాగానే అఘమేఘాల మీద ప్రభుత్వం ఈ నోటును రద్దు చేసిందా..? అక్రమార్కులు ముందుగానే తమ ధనాన్ని మార్చుకోకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఇలా చేసిందా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఓ వైపు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ ప్రజలకు కావాల్సినన్ని నోట్లు సిద్దంగా వున్నాయి.. వాటని అవసరమైతే విమానాల్లో పంపిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నా.. అవి ఎంతవరకు నిజమో అన్న సందేహాలు మాత్రం దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అర్భీఐ తీసుకుంటున్న చర్యలు ఇందుకు పూర్తి బిన్నంగా వున్నాయి. మరికోన్ని రోజుల పాటు డబ్బును నేరుగా బ్యాంకులకే పంపాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. శ వ్యాప్తంగా 2.10 లక్షల ఏటీఎంలు ఉండగా కొన్నింటిలోనే నగదు అందుబాటులో ఉంటోంది.

కేవలం 27 వేల ఏటీఎంలలో మాత్రమే డబ్బు లభిస్తోంది. గత నెలలో 30 శాతం ఏటీఎంలలో డబ్బు నింపగా, ప్రస్తుతం 13 శాతం ఏటీఎంలలోనే నగదు అందుబాటులో ఉంటోంది. గత నెల 8న కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత కరెన్సీ సమస్య ఏర్పడిన సంగతి తెలిసిందే. కొత్తగా ముద్రించిన 500, 2000 రూపాయల నోట్లు డిమాండ్‌కు తగినట్టుగా అందుబాటులోకి రాలేదు. బ్యాంకులు, ఏటీఎంల ముందు భారీగా క్యూలు ఉంటున్నాయి. చాలా ఏటీఎంలు మూతపడగా, చాలా చోట్ల బ్యాంకుల్లో కూడా డబ్బు లేదని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rbi  currency  banks  atms  demonetisation  shaktikanth das  

Other Articles