ఇంగ్లాండ్ ధీటుగా భారత్ బదులు.. డబుల్ సెంచరీ చేజార్చుకున్న రాహుల్ India solid in reply to England's 477 on Day 3

Devastated kl rahul out for 199 as england s bowlers toil on day three

India vs England, Chennai, 5th Test, KL Rahul, cricket score, chidambaram Stadium, chennai stadium, chidambaram pitch, Virat Kohli, kl rahul, parthiv patel, India national cricket team, England cricket team, Cricket score

kL Rahul made 199 runs, his fourth Test hundred and first in home soil, was the fulcrum around which India build their first innings in reply to England's 477 on Sunday.

ఇంగ్లాండ్ ధీటుగా భారత్ బదులు.. డబుల్ సెంచరీ చేజార్చుకున్న రాహుల్

Posted: 12/18/2016 05:43 PM IST
Devastated kl rahul out for 199 as england s bowlers toil on day three

చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా పర్యాటక జట్టు ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ధీటుగా రాణిస్తుంది. ఇంగ్లండ్ సాధించిన భారీ స్కోరుకు టీమిండియా కొంత దూకుడుగానే సమాధానమిస్తోంది. జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టు మూడవ రోజు భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ (199;310 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో డబుల్ సెంచరీ సాధించే అవకాశాన్ని కొద్దిలో కోల్పోయాడు.

రాహుల్, పార్థీవ్ పటేల్(71: 112 బంతుల్లో 7 ఫోర్లు), కరుణ్ నాయర్(71 నాటౌట్; 136 బంతుల్లో 6 ఫోర్లు) రాణించడంతో భారత్ పటిష్టస్థితిలో నిలిచింది. మూడో రోజు ఆట నిలిపివేసే సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 391 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ తో పాటు మురళీ విజయ్ 17 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, రషీద్, మోయిన్ అలీ, స్టోక్స్ తలో వికెట్ తీశారు.

ఓవర్ నైట్ స్కోరు 60 తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్ కు గట్టి పునాది వేశారు. పార్థీవ్(71) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పుజారాను స్టోక్స్ పెవిలియన్ బాట పట్టించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(15) స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ కు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్ గా వెనుదిరిగాడు. మరో ఆరు ఓవర్లలో మూడో ఆట ముగస్తుందనగా రషీద్ వేసిన బంతిని రాహుల్ ఆడి బట్లర్ పట్టిన ఈజీ క్యాచ్ తో ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ కోల్పోయి నిరాశగా వెనుదిరిగాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles