టర్కీ రాజధాని అంకారాలోని ఓ ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న రష్యా రాయబారిని ఓ అనుమానిత ఉగ్రవాది కాల్చిచంపిన ఘటన జరిగి 24 గంటలు కూడా గడవక ముందే మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. సిటీలో ఓ ఎగ్జిబిషన్ లో టర్కీలో రష్యా రాయబారి ఆండ్రీ కర్లోవ్ మాట్లాడుతుండగా వెనకనుంచి వచ్చిన ఆగంతకుడు గన్ తో ఆండ్రీపై విచక్షణరహితంగా కాల్పులు జరిపి హతమార్చాడు. ఈ ఘటన మిగిల్చిన విషాధచాయల నుంచి కోలుకుంటున్న తరుణంలో మరో హింస్మాత్మ ఘటన చోటుచేసుకుంది.
అంకారాలోని అమెరికా రాయబార కార్యాలయం ముందు ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. నల్లటి కోటు ధరించి వచ్చిన ఆ ఆగంతుకుడు... గాల్లోకి ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపాడు. అనంతరం ఎంబసీలోకి చొరబడేందుకు యత్నించాడు. కాని, అక్కడ ఉన్న గార్డులు అతన్ని సమయస్ఫూర్తితో ఎదుర్కొని... అతడిని పట్టుకున్నారు. చేతిలోని గన్ ను లాక్కుని, అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయలు కాలేదు. కానీ, వరుసగా రెండో ఘటన జరగడంతో అక్కడి అధికారులు అలర్ట్ అయ్యారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న అందోళనకు టర్నీ వాసులు గురవుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more