ఎగిరిపోతున్న పాతనోట్లను పట్టుకున్న అధికారులు.. Private charter grounded for flying with Rs 3.5 crore in old notes

Private charter grounded for flying with rs 3 5 crore in old notes

demonitization, old notes, private chartered flight, Cessna Citation XL, 3.5 crores old notes, hissar, haryana, Dimapur, Nagaland, Bureau of Civil Aviation Security (BCAS), security programme

A private charter company has been grounded after one of its aircraft was rented to fly a person with Rs 3.5 crore in demonetised currency notes from Haryana's Hisar to Dimapur in Nagaland

ఎగిరిపోతున్న పాతనోట్లను పట్టుకున్న అధికారులు..

Posted: 12/22/2016 03:51 PM IST
Private charter grounded for flying with rs 3 5 crore in old notes

అవును మీరు చదువుతున్నది నిజమే.. ఎగిరిపోతున్న పాత పెద్దనోట్లను అధికారులు పట్టుకున్నారు. ఎలా అంటూ వివరం అడుగుతున్నారా..? పౌరాణిక చిత్రాలు, కథలలో చెప్పినట్లుగా రాక్షసులు ఇక్కడ కానీ వారి ప్రాణాలు మాత్రం సప్తసముద్రాల అవల కోటి గూటిలోని చిలుకలో. అన్నట్లుగానే ఇక్కడ దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అవసరాలకు డబ్బులందరక, అష్టకష్టాలు పడుతున్న వేళ.. రాష్ట్ర హద్దులు దాటి.. రాష్ట్రాలను దాటించి ఈశాన్య భారతావనిలోకి పాతనోట్లను తీసుకుళ్తుండగా.. వారి అధికారులు పట్టుకుని డబ్బును స్వాథీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని హిస్సార్ నుంచి నాగాలండ్‌లోని డిమాపూర్‌కు పాత పెద్ద నోట్లను తరలిస్తుండగా.. అధికారులు పట్టుకున్నారు. అయితే కారులోనే మరోదే వాహనంలోనో కాదే ఏకంగా ఒక ప్రైవేటు విమానంలో రూ. 3.5 కోట్లను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. విమానాన్ని దించేసి అందులో డబ్బును తరలిస్తున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు ఛాపర్ సంస్థపై కూడా వేటు వేశారు. ప్రైవేటు విమానాలు ఎగరాలంటే తప్పనిసరిగా ఉండాల్సిన సెక్యూరిటీ ప్రోగ్రాంను సదరు ఎయిర్ కార్ ఎయిర్ లైన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు రద్దు చేశారు.

అయితే ఈ ఘటనపై సదరు ఎయిర్ ఛాపర్ సంస్థ కూడా వివరణ ఇచ్చింది. తాము హర్యానా ఈ విమానం నడిపిస్తున్న ఎయిర్‌కార్ ఎయిర్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) రద్దుచేసింది. హిస్సార్‌లో తాము బ్యాగులు చెక్ చేశామని, అందులో కేంద్రం రద్దుచేసిన 500, 1000 నోట్లు ఉన్నాయన్న విషయాన్ని ఏటీసీకి పైలట్లు తప్పనిసరిగా చెప్పాలి. అయితే, పైలట్ టాయిలెట్‌కు వెళ్లాల్సి వచ్చిందని, అందువల్ల ఏటీసీకి ఆ విషయం చెప్పలేదని ఎయిర్‌కార్ చెబుతోంది.
 
ఎయిర్‌కార్ సంస్థకు మూడు విమానాలున్నాయి. వాటిలో ఒకదాన్ని హిస్సార్‌లో సెక్యూరిటీ చెకింగులు ఏమాత్రం లేని ఒక చిన్న ఎయిర్‌ఫీల్డ్ నుంచి తీసుకుని నవంబర్ 22న డిమాపూర్‌కు బయల్దేరి వెళ్లారు.  తాను ఈ మొత్తానికి పన్ను కట్టానని, కొంత మినహాయింపు ఉందని చెప్పిన ప్రయాణికుడు.. అందుకు ఆధారంగా కొన్ని పత్రాలను కూడా చూపించాడని, అందుకే తమ పైలట్లు పెద్దగా పట్టించుకోలేదని ఎయిర్‌ కార్ అధినేత మానవ్ సింగ్ చెప్పారు.
 
పెద్దనోట్లను రద్దు చేయకముందు కూడా చాలామంది పెద్దమొత్తాలను దూరప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు ఇలాగే పెద్దగా సెక్యూరిటీ చెకింగులు ఏవీ లేని చిన్న చిన్న ఎయిర్‌ఫీల్డుల నుంచి ప్రైవేటు విమానాలు తీసుకుని వెళ్లేవారు. దాంతో.. ఇలాంటి చిన్న ఎయిర్‌ఫీల్డుల నుంచి బయల్దేరే ముందు తప్పనిసరిగా పోలీసుల పర్యవేక్షణలో ప్రయాణికుల బ్యాగేజి చెక్ చేయాలని డీజీసీఏ స్పష్టం చేసింది. అయినా అక్కడక్కడ మాత్రం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonitization  old notes  private chartered flight  3.5 crores old notes  hissar  haryana  

Other Articles