హైజాకైన విమానం నుంచి 29 మందికి విముక్తి.. Libyan plane with 118 on board hijacked, lands in Malta

Libyan plane hijacked 29 passengers released from afriqiyah airways flight in malta

Libya Flight Hijacked,Plane Hijacked,Afriqiyah Airways Hijacked,Afriqiyah Airways Plane Hijacked,Afriqiyah Airways,Joseph Muscat,Potential Hijack,Malta,Libyan Plane Hijacked,Libyan Plane,Hijack,Plane Hijack,Libyan Plane Hijacking,Malta Plane,Malta Plane Hijacket, crime news

More than half of the 118 people on board an Afriqiyah Airways flight which has been hijacked from Libya and diverted to Malta where it landed earlier today, have been released, according to reports.

హైజాకైన విమానం నుంచి 29 మందికి విముక్తి..

Posted: 12/23/2016 04:19 PM IST
Libyan plane hijacked 29 passengers released from afriqiyah airways flight in malta

యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉల్లిక్కిపడింది. ప్రపంచ దేశాల్లోని అన్ని విమానాశ్రాయాల వద్ద భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. గత కొంతకాలంగా విమానాలు సంబంధిత ఏటీసీ కేంద్రాల నుంచి సంబంధాలను తెంచుకుని మిస్ అవుతున్న క్రమంలో ఇవాళ ఏకంగా ఓ విమానాన్ని దుండగులు హైజాక్ చేసిన వార్తతో ప్రపంచం కలవర పాటుకు గురైంది. లిబియా  అంతర్గత  విమానాన్ని ఇద్దరు దుండగులు హైజాక్ చేశారు. లిబియా ప్రభుత్వ రంగ సంస్థ ఆఫ్రికియా ఎయిర్ వేస్ కు చెందిన ఎయిర్ బస్ 320 అనే విమానాన్ని దుండగులు హైజాక్ చేశారు.

మొత్తం 118 మంది విమానంలో వుండగా అందులో 111 మంది ప్రయాణికులు ఏడుగురు సిబ్బంది వున్నారని అధికారవర్గాల సమాచారం. సెబా నుంచి వాయువ్య లిబియాలోని ట్రిపోలి నగరానికి బయలుదేరిన విమానాన్ని దుండగులు మధ్యలో దారి మళ్లించి మాల్టా లో డొమెస్టిక్ విమానాశ్రయంలో ల్యాండ్ చేసినట్టు, మాల్టీస్ మీడియా నివేదించింది. తమకు తాము లిబియా మాజీ అధ్యక్షడు మహమ్మద్ గఢాఫీ మద్దతుదారులుగా ప్రకటించుకున్న హైజాకర్లు తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో విమానాన్ని తమ వద్దనున్న డిటోనేటర్లతో పేల్చివేస్తామని బెదిరిస్తున్నట్టు మల్టీస్ మీడియా వెల్లడించింది.

మరోవైపు మాల్టీస్ ప్రధానమంత్రి జోసెఫ్ మస్కట్ కూడా విమాన హైజాక్ విషయాన్ని ట్విట్టర్ ద్వారా దృవీకరించారు. భద్రతా దళాలు రక్షణ మరియు అత్యవసర చర్యల్ని చేపట్టినట్టు తెలిపారు.  వీరిలో 82 మంది పురుషులు, 28 మహిళలు, ఒక  శిశువు ఉన్నట్టు ట్వీట్ చేశారు. హైజాకర్లతో జరుగుతున్న చర్చల్లో భాగంగా ముందుగా మహిళలను శిశువులను వదిలివేయడానికి అంగీకరించిన హైజాకర్లు.. వారికి విముక్తి కల్పించారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hijackers  libya plane  malta  air bus 320  118 on board  valletta  crime news  

Other Articles