హైదరాబాద్ రాయదుర్గంలోని షా గౌస్ హోటల్‌పై సోషల్ మీడియాలో అసత్య కథనాలను ప్రచారం చేసిన యువకుడు ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు. షా గౌస్ హోటల్లో మటన్ బిర్యాని అర్డర్ చేస్తే.. కుక్క మాంసంతో వండిన బిర్యాని వడ్డిస్తున్నారంటూ ఇటీవల పెద్ద ఎత్తున్న ప్రచారం జరిగింది. తాను సృఫ్టించిన ఒక ఫేక్ న్యూస్ ను సోషల్ మీడియా వాట్సాఫ్ గ్రూప్ లో పోస్టు చేయడం ద్వారా దానిని విపరీతంగా షేర్ చేసుకున్న నెట్ జనులు ఔరా ఇది నిజమేనా అంటూ నివ్వెరపోయారు. ఇక ఏ హోటల్ లోనూ బిర్యాని తినడానికి బోజనప్రియులు అఇష్టత వ్యక్తం చేశారు.
దీంతో సదరు యువకుడు క్రియేట్ చేసిన వదంతులను ఏమాత్రం కన్ఫామ్ చేసుకోకుండా న్యూస్ ఛానెళ్లు కూడా అత్యుత్సాహాం ప్రదర్శించాయి. షా గౌస్ హోటల్లో కుక్క బిర్యాని అమ్ముతున్నారని వెల్లడించి.. అసత్య వార్తలకు విపరీత ప్రచారాన్ని చేశాయి. న్యూస్ ఛానెళ్లలో వార్తలు రావడంతో గిరాకీ దెబ్బతిన్న దిగాలుగా కూర్చున్న హోటల్ యాజమాన్యంపై పుండు మీద కారం పడినట్లుగా జీహెచ్ఎంసీ హెల్త్ అధికారులు షా గౌస్ హోటల్ పై రైడ్ కూడా నిర్వహించారు. అయితే వార్తా చానెళ్లలో వచ్చినట్లు అక్కడ ఏ మాత్రం కూడా అనుమానాస్పద స్థితులు కనబడలేదు. తాము ఏ పాపం చేయని సదరు హోటల్ యజమాని మహమ్మద్ రబ్బానీ అధికారులకు తెలిపాడు.
అంతటితో అగకుండా తన హోటల్ పరుపు తీసిన వ్యక్తులతోనే నిజాన్ని రాబట్టాలనుకుని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాడు. తప్పుడు వార్తల కారణంగా తమ హోటల్ పరువుపోయిందని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమగ్రంగా దర్యాప్తు జరిపి అసలు విషయాన్ని కనుగొన్నారు. ఈ పుకార్లు రావడానికి మూల కారణమైన చంద్రమోహన్ అనే యువకుడిని కనుగొని అరెస్టు చేశారు. కుక్క మాంసంతో బిర్యాని తయారు చేస్తున్నారని ఈ యువకుడే ఫేక్ న్యూస్ ను సృష్టించి తన వాట్సాప్ ద్వారా షేర్ చేశాడని పోలీసులు తెలిపారు. రెస్టారెంట్ కు వెళ్తున్న తన స్నేహితులను భయపెట్టేందుకు ఎంబీఏ విద్యార్థి అయిన చంద్రమోహన్ ఈ పుకారును తన స్నేహితులకి పంపించాడని పోలీసులు తెలిపారు.
అందుకోసం తల నరికిన కుక్కల ఫొటోలను సృష్టించి, రాయదుర్గంలోని షా గౌస్ హోటల్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారని ఫేక్ న్యూస్ ను పంపించాడు. దీంతో చంద్రమోహన్ స్నేహితులు తమకు వచ్చిన వివరాలను వేరే వాట్సాప్ గ్రూప్ లకు పంపించారు. ఇలా ఆ న్యూస్ వాట్సప్ లో చక్కర్లు కొట్టింది. వాట్సప్ గ్రూప్ లను పరిశీలించుకుంటూ వెళ్లగా ఆ న్యూస్‌ను చంద్రమోహన్ సృష్టించాడని తమకు తెలిసిందని పోలీసులు తెలిపారు. ఇదే ఫేక్ న్యూస్‌ను నమ్మిన న్యూస్ చానెళ్లు నిజానిజాలు తెలుసుకోకుండా ప్రసారం చేశాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more