ఉద్యమ పార్టీగా చెప్పుకునే టీఆర్ఎస్ ప్రభుత్వం.. తమ పాలనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిని అణచివేయాలని చూడటం దారుణమని టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఎవరు ఎదురు తిరిగినా వారిని అరెస్టు చేసిన నిరంకుశంగా అణగదొక్కేందుకు యత్నిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ తీసుకువచ్చిన భూసేకరణ విధానానికి వ్యతిరేకంగా ఆయన తన నివాసంలో దీక్షకు దిగారు.
భూసేకరణ చట్టంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరాపార్కులో భూనిర్వాసితులతో దీక్ష చేయాలని టీజేఏసీ నిర్ణయించగా.. జేఏసీ కార్యకర్తలని అరెస్టు చేసి రాత్రంతా చలిలో ఉంచారని ఆయన అన్నారు. ఇంత భయంతో ప్రభుత్వం పాలన సాగించడం ఎందుకని కోదండరాం ప్రశ్నించారు. ఇది చాలా అన్యాయమని అన్నారు. ఈ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వని నేపథ్యంలో తామంతా మరో రూపంలో ప్రభుత్వానికి తమ నిరసనను తెలుపుదామని నిర్ణయించుకోగా, ప్రభుత్వం తమ నేతలను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
టీజేఏసీ తలపెట్టిన భూనిర్వాసితుల హక్కుల సాధన దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం, ఎక్కడికక్కడ జేఏసీ నేతల్ని అరెస్టు చేయడంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రశాంతంగా నిరసన తెలుపుదామనుకున్నామని తమ నేతలను ఎందుకు అరెస్టులు చేస్తున్నారో అర్ధం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నిరసన తెలపడం తప్ప వేరే మార్గం లేదని ఆయన అన్నారు. అరెస్టయిన వారిని తక్షణం బేషరుతుగా ప్రభుత్వం విడుదల చేయాలని, అప్పటివరకు తన దీక్షను ఆపబోనని అన్నారు. తాను చేస్తున్నది నిరాహార దీక్ష అని ప్రకటించారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేసినట్లు అధికారికంగా ప్రకటన రావాలని అప్పటివరకు కొనసాగిస్తానని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాల తరహాలోనే అభివృద్ది పేరుతో కొంతమంది నాశనం కావాలనే ధోరణిని అవలంభిస్తుందని, ఇది సహేతుకం కాదన్ని ఆయన ప్రభుత్వానికి సూచించారు. శాసనసభలో అప్రజాస్వామికంగా భూసేకరణ బిల్లు-2013కు సవరణకు చేస్తూ ఆమోదం తెలిపారని ఆయన మండిపడ్డారు. 2013 చట్టం రైతులకు హక్కులు కల్పించిందన్నారు. దానికి రాజ్యంగ విరుద్దంగా సవరణలు చేసి భూమిని సేకరిస్తామని ప్రకటించడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణిని తెలియజేస్తుందని ధ్వజమెత్తారు.
అభివృద్ధికి భూసేకరణ చేయవచ్చు.. కానీ, అవసరమైన దాని కంటే ఎక్కువగా భూసేకరణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అభివృద్ధి పేరుతో నష్టం కలిగించే విధానాలకు తాము వ్యతిరేకమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తమ వినతిని పరిశీలిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమ చుట్టూ ఎక్కడ చూసినా పోలీసులే కనపడుతున్నారని ఆయన అన్నారు. రేపు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ప్రదర్శనలు నిర్వహించి, వినతి పత్రాలు సమర్పించాలని ఆయన టీజేఏసీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కోదండరామ్ దీక్షకు విపక్షాల మద్దతు
తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తోన్న భూసేకరణ విధానానికి వ్యతిరేకంగా కోదండరాం చేపట్టిన దీక్షకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం పార్టీలు మద్దతు తెలిపాయి. తెలంగాణశాసనసభలో భూసేకరణ చట్టం బిల్లు సవరణలకు ఆమోదం తెలిపిన సందర్భంగా సభలో సీఎం కేసీఆర్ మాట్లాడిన తరువాత తమను మాట్లాడే అవకాశాన్ని కల్ిపంచకపోవడంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. తమకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాలని.. డిమాండ్ చేస్తూ.. తమ నిరసనను లేఖ రూపంలో స్పీకర్ మధుసూదనాచారికి అందజేశాయి. ఈ నేపథ్యంలో విపక్షాలన్నీ అసెంబ్లీని బహిష్కరించి.. నేరుగా కోదండరామ్ ఇంటికి బయలుదేరాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more