ఒకటి ఉద్యమ పార్టీ.. మరోకటి విప్లవ పార్టీ. రెండు పార్టీలు తాము నిర్ధేశించిన లక్ష్యాలను సాధించాలన్న అకాంక్షతోనే ముందుకు సాగుతున్నాయి. ప్రజావసరాల మేరకు నిర్ణయాలను తీసుకుని వారి సంతృప్తే ధ్యేయంగా పయనిస్తున్నాయి. కానీ అధికారంలో వున్న ఉద్యమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఏకంగా విప్లవ పార్టీని అత్యంత చులకన చేసి మాట్లాడారని అరోపిస్తూ ఇవాళ విప్లవ పార్టీ నేత మండిపడ్డారు. పార్టీలను చులకన చేసి, ప్రజలను మాయచేసే చర్యలు మానుకోవాలని సూచించారు.
భూసేకరణ చట్టంలో సవరణల బిల్లుపై చర్చ సందర్భంగా క్రితంరోజున శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీపై చేసిన వ్యాఖ్యల పట్ల సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చాలా అసభ్యంగా, వ్యంగ్యంగా తమ పార్టీని గుండుసూది పార్టీ అనడంతో పాటు పలు వ్యాఖ్యలు చేశారని సున్నం రాజయ్య అన్నారు. శాసనసభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
సీపీఎం పార్టీ దేశ వ్యాప్తంగా ప్రజల తరఫున పోరాడే పార్టీ అని ఆయన అన్నారు. ప్రజలతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకునే పార్టీ అని చెప్పారు.కేసీఆర్ అటువంటి వ్యాఖ్యలు చేసి ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేశారని రాజయ్య అన్నారు. ఈ విషయంపై తాము ఈ రోజు స్పీకర్ మధుసూదనాచారికి లేఖ ఇచ్చామని చెప్పారు. నిన్న భూసేకరణ చట్టం సవరణలపై చర్చ సందర్భంగా తాము చేసిన సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. నిర్వాసిత ప్రాంతాల్లో ప్రభుత్వం సర్వే చేపట్టి రైతుల కష్టాలను తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more