జార్ఖండ్లో ఘోర గని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే చనిపోగా, కొందరు గని కింద చిక్కుక్కు పోయారు. గోదా జిల్లాలోని ఓపెన్ కాస్ట్ మైన్ లో ఇది జరిగింది. లాల్మాటియా ప్రాంతంలోని బొగ్గుగని 200 అడుగుల లోపల పని జరుగుతుండగా, పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. సరిగ్గా ఎంట్రెన్స్ వద్ద పైకప్పు కుప్పకూలిపోవటంతో పరిస్థిితి సంక్లిష్టంగా మారింది. దీంతో గనిలో పనిలో ఉన్న దాదాపు 60 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారని తెలుస్తోంది.
గత రాత్రి 8.30 సమయంలోనే ఇది సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది పట్నా నుంచి ఘటనా స్థలానికి బయలుదేరాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
కాగా, శకలాల కింద 40 మంది చిక్కుకుని ఉంటారని తోటి ఉధ్యోగులు చెబుతున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోవటంపై ప్రధాని మోదీ తన ట్విట్టర్ లో సంతాపం వ్యక్తం చేశాడు.
Saddened by the loss of lives at a mine in Jharkhand. My prayers are with those trapped inside. Spoke to CM Raghubar Das on the situation.
— Narendra Modi (@narendramodi) December 30, 2016
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more