సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ములాయంసింగ్ యాదవ్ ఆదివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయన అధిక రక్తపోటుకు గురికావడంతో వెంటనే ఆయన నివాసానికి చేరుకున్న వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. ములాయం అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులతోపాటు పార్టీ నేతలు ఆందోళనకు గురయ్యారు.
గత రెండు రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో తీవ్ర కలత చెందడం వల్లే ఆయన ఆనారోగ్యానికి గురైనట్టు చెబుతున్నారు. ములాయం అస్వస్థతకు గురైన వార్త తెలుసుకున్న శివపాల్ యాదవ్ వెంటనే ములాయం ఇంటికి చేరుకుని పరామర్శించారు. ఇక ఆదివారం తనకు తానుగా ఎస్పీ జాతీయ అధ్యక్షుడినంటూ అఖిలేష్ యాదవ్ ప్రకటించుకున్న విషయంత తెలిసిందే. అంతేకాదు పార్టీ గుర్తు సైకిల్ కోసం ఎన్నికల కమీషన్ ను సంప్రదించనున్నాడు కూడా. ఇక బాబాయ్ శివపాల్ యాదవ్ ను పార్టీ అధ్యక్షుడి పదవి నుంచి తొలగించి ఆ స్థానే నరేష్ ఉత్తర్ ను నియమించాడు. ఇక ముసలంకు ప్రధాన కారకుడనే ఆరోపణలు ఎదుర్కుంటున్న రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ ను ఎస్పీ నుంచి బహిష్కరించాడు అఖిలేష్. కుటుంబ గౌరవం కాపాడేందుకే తాను ఈ పని చేస్తున్నట్లు తెలిపాడు కూడా.
ములాయం వర్షన్...
అయితే దీనిపై ములాయం సింగ్ మాత్రం మండిపడ్డాడు. 5000 మంది కార్యకర్తలతో జనేశ్వర్ మిశ్రా పార్క్ వద్ద ఆదివారం అఖిలేష్ జరిపిన సభను వ్యతిరేకించటమే కాదు, అతను తీసుకున్న నిర్ణయాలు చెల్లవంటూ ములాయం పేర్కొన్నాడు. అంతేకాదు అఖిల్ కు మద్ధతుగా నిలిచిన వైస్ ప్రెసిడెంట్ కిరొన్ మోయి నంద, నరేశ్ అగర్వాల్ ను బహిష్కరిస్తున్నట్లు తెలిపాడు. ఇప్పటికే 6 ఏళ్లపాటు మరో సోదరుడు రాంగోపాల్ ను బహిష్కరించినట్లు తెలిసిందే. దానిపై మరోసారి ప్రకటన చేశాడు. అఖిలేష్ చేస్తుంది ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని ఖండించాడు. జనవరి 5న తన ఆధ్వర్యంలో ఓ సభను నిర్వహించనున్నట్లు తెలిపాడు.
అమర్ సింగ్ విలన్ కాదా?
సమాజ్‌వాదీ పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్‌సింగ్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమర్‌సింగ్ లండన్ పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచే ఆయన స్పందిస్తూ పార్టీలో, ములాయం కుటుంబంలో నెలకొన్న కలహాలకు తాను కారణం కాదని వ్యాఖ్యానించారు. తనపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయని, తనను ఇలా బతకనివ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ కుటుంబంలో నెలకొన్న విభేదాలకు తానే కారణమని ములాయం సింగ్ యాదవ్ భావిస్తే తనను పార్టీ నుంచి పంపించేయవచ్చని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం తనను ఓ విలన్‌గా చిత్రీకరిస్తున్నారనీ అమర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వస్తోన్న ఆరోపణల నుంచి తనను కాపాడాలని ములాయం సింగ్‌ను కోరారు. ఇటీవలే ములాయం సింగ్ అసెంబ్లీ ఎన్నికల జాబితాను వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆ అభ్యర్థుల జాబితా గురించి తనకు తెలియదని అమర్‌సింగ్ అన్నారు. జాబితాలో ఎవరికి టిక్కెట్లు దక్కాయో, ఎవరికి దక్కలేదో కూడా తనకి తెలియదని చెప్పారు. కొందరు వ్యక్తులు తనపై ఆరోపణలు గుప్పిస్తూ తనకు వ్యతిరేకంగా పోస్టర్లు ముద్రిస్తూ, తన దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మరో సీనియర్ నేత అజాంఖాన్ మాత్రం అమర్ సింగ్ మూలంగానే పార్టీ ఇప్పడు ఇలాంటి సంక్షోభం ఎదుర్కుంటుందని ఆరోపించటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more