బ్యాంకులు ఎంత భద్రత చూపిస్తున్నా సైబర్ నేరగాళ్లు తమ చేతి వాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. క్యాష్ లెస్ పిలుపు నేపథ్యంలో ప్రస్తుతం ఆన్ లైన్ వ్యవహారాలు, కార్డులతో కొనుగోళ్లు ఎక్కువ అయిపోయాయి. అయితే గతేడాది పెద్దఎత్తున జరిగిన కార్డుల హ్యాకింగ్ కలవరపాటుకు గురిచేస్తోంది. చేతిలో నగదు లేకపోవటంతో తప్పని పరిస్థితుల్లో భయం భయంగానే లావాదేవీలు చేస్తున్నవారు ఎందరో. అయితే ఇలాంటి సమస్యలకు ఓ పరిష్కారం చూపుతాం అంటోంది అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఇందుకు కావాల్సిందల్లా స్మార్ట్ ఫోన్, అకౌంట్ కు సంబంధం ఉన్న రిజిస్ట్రర్డ్ ఫోన్ నంబర్ మాత్రమే అని చెబుతోంది.
సైబర్ మోసాలకు ముఖ్యకారణంగా మారుతున్న డెబిట్ కార్డుల సమాచార తస్కరణకు చెక్ పెట్టేవిధంగా ‘క్విక్’ అనే యాప్ ను త్వరలో అందుబాటులోకి తేనుంది. ఇతరులు పిన్ నంబర్ తెలుసుకోవటం, లేదా కార్డు పొగొట్టుకున్న సందర్భాలలో కార్డు ను బ్లాక్ చేసే విధంగా ఈ యాప్ ఉండబోతుంది. అంటే యాప్ ద్వారా మీ కార్డు వినియోగాన్ని మీరే నియంత్రించుకునే సదుపాయం అన్న మాట. అంతేకాదు పిన్ లాక్ సదుపాయం కూడా ఇందులో ఉండబోతుంది. దీనివల్ల పొరపాటున మీ డెబిట్ కార్డు పిన్ నంబర్ ఎవరికైనా తెలిసినా కార్డు వినియోగించలేరని, అందువల్ల మన నగదుకు పూర్తి భరోసా ఉంటుందని చెబుతున్నారు.
క్విక్ యాప్ ఎందుకు?
ఇదేం కొత్త ప్లాన్ కాదు. అమలు చేయాలని ఏడాది నుంచి చూస్తున్నదే. బ్యాంకు ఖాతాదారుడికి డెబిట్ కార్డు అందజేసిన బ్యాంకర్లు దాన్ని వినియోగించుకునేందుకు నాలుగు అంకెల పిన నంబర్ ఇస్తారు. ఇది ఖాతాదారుడు ఎవరికీ వెల్లడించకూడదు. సాధారణంగా ఖతాదారులు పిన్ నంబర్ ఎవరికీ చెప్పరు. కాకుంటే మోసం, అవగాహన లోపం, ఇతరత్రా కారణాల వల్ల పిన్ నంబర్ తెలిసిందని అనుమానం వస్తే వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వాలి. అప్పుడు వారు కార్డు బ్లాక్ చేసి కొత్త పిన్ నంబర్‌ను ఎలాట్ చేస్తారు. చూడడానికి ఇది పకడ్బందీగానే కనిపిస్తున్నా నిత్యం ఎన్నో మోసాలు వెలుగు చూస్తునే ఉన్నాయి. ఏదో రూపంలో పిన్ నంబర్ తెలుసుకుంటున్న మోసగాళ్లు తెలివిగా సదరు ఖాతాల్లోని నగదు ఖాళీ చేస్తున్నారు. ఒక్కోసారి ఖాతాదారులు లక్షల్లో నష్టపోయి లబోదిబోమంటున్నారు. ఇటువంటి సైబర్ మోసాలు జరిగినప్పుడు నష్టపోయిన సదరు మోత్తానికి తాము కూడా చేసింది ఏమీ లేదని చేతులెత్తేస్తున్నారు. వీటిని నియంత్రించేందుకు ఈ క్విక్ యాప్.
పరిష్కారం ఎలాగంటే...
స్మార్ట్ ఫోన్ ఉన్న వినియోగదారులు ఈ యాప్ డౌనలోడ్ చేసుకుని తమ ఏటీఎం కార్డును దీంతో కనెక్ట్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఇలా వినియోగించుకోవడం వల్ల కార్డు దుర్వినియోగం వందశాతం అరికట్టవచ్చంటున్నారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కా రంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ ‘ఎస్బీఐ క్విక్’ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఖాతాదారులు తమకు డెబిట్ కార్డు జారీచేసిన బ్యాంకు శాఖ అధికారులను సంప్రదించి యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నట్లు తెలియజేయాలి. వారిచ్చిన సూచనల మేరకు యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులోని ఆప్షన ప్రకారం డెబిట్ కార్డు నంబర్‌ను ఎంటర్ చేయాలి. యాప్‌లో మీ నంబర్ అప్లోడ్ అవుతుంది.
మన రిజిస్ట్రర్డ్ నంబర్ నుంచి ఇంగ్లీష్‌లో ఆన్ ఈజీ అని కొట్టి గ్యాప్ ఇచ్చి వినియోగదారుడి రిజిస్ట్రర్డ్ నంబర్ టైప్ చేయాలి. అనంతరం దాన్ని 0922348888 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. మన రిజిస్ట్రర్డ్ నంబర్‌కు కన్ఫర్మేషన్ వస్తుంది. అలా రాలేదంటే మనం బ్యాంక్‌లో రిజిస్ట్రేషన్ చేసిన ఫోన్ నంబర్‌ను మార్చుకోవాలి. దీంతో నిరంతరం వినియోగదారుడు మాత్రమే తన కార్డును వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు మీరు మీ కార్డు వాడకాన్ని లాక్ చేయాలనుకుంటే యాప్‌లోకి వెళ్లి ‘ఆఫ్’ చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత ఏటీఎంలో కార్డు పెట్టి ట్రాన్సాక్షన్‌కు ప్రయత్నించినా ఎటువంటి ఫలితం ఉండదు. లావాదేవీలు జరగవు. మళ్లీ మీరు యాప్‌లోకి వెళ్లి ‘ఆన్’ అని ప్రెస్ చేసినప్పుడు మాత్రమే లావాదేవీలు జరుగుతాయి. దీనివల్ల ఇతరులెవరైనా మీ కార్డును చోరీ చేసినా, ఇతరత్రా విధానాల్లో మీ కార్డును దుర్వినియోగం చేయాలని ప్రయత్నించినా ఎటువంటి ఫలితం ఉండదు.
షాపింగ్ నియంత్రించవచ్చు. సాధారణంగా సైబర్ నేరాల్లో రెండు రకాల చోరీలు జరుగుతుంటాయి. ఒకటి మన ఖాతా నుంచి నగదు వేరే ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయడం, లేదా మన కార్డు ఉపయోగించి పెద్ద మొత్తంలో షాపింగ్ చేయడం. అందువల్ల పిన్ ఆన్/ఆఫ్ సదుపాయం వల్ల ఈ రెండు రకాల చర్యలను నిరోధించవచ్చు. సైబర్ నేరగాళ్లకు మన పిన్ నంబర్ పొరపాటున తెలిసినా షాపింగ్ చేయడంగాని, డబ్బులు వేరే ఖాతాలోకి మరల్చడంగాని చేయలేరు.
ఫోన్ పోయినా, చార్జింగ్ లేక స్విచ్చాఫ్ అయినా ఇబ్బంది వచ్చినట్టే. అత్యవసర సమయంలో ఈ పరిస్థితి ఎదురైతే ఏం చేయాలో అర్థంకాకపోవచ్చు.
త్వరలో మిగతా బ్యాంకులు కూడా...
ప్రస్తుతానికి ఈ యాప్‌ను ఎస్బీఐ మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. దీనిపై విస్తృత ప్రచారం జరిగి ఖాతాదారులకు ప్రయోజనం కలిగితే మిగిలిన జాతీయ, ప్రైవేటు బ్యాంక్‌లు కూడా అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. ఇలా అన్ని బ్యాంక్‌లు ఇటువంటి రక్షణాత్మక చర్యలు చేపడితే సైబర్ నేరాలను చాలా వరకు అరికట్టవచ్చు.
యాప్‌లో పిన్ ఆన్, ఆఫ్ సదుపాయమే కాకుండా మరెన్నో సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అకౌంట్ సర్వీసెస్ ద్వారా రిజిస్ట్రేషన్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, ఆరు నెలల స్టేట్మెంట్, ఎడ్యూలోన్, హోమ్‌లోన్ సర్టిఫికెట్ వంటి సదుపాయాలు పొందవచ్చు. అలాగే ఏటీఎం డెబిట్ కార్డు ఆప్షనలోకి వెళ్లి కార్డు బ్లాక్ చేసుకునే సదుపాయం పొందవచ్చు. కొన్నిసందర్భాల్లో మనం మన ఏటీఎం కార్డు పొగోట్టుకుంటాం. లేదా ఎవరైనా దొంగతనం చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో కార్డును బ్లాక్ చేసునే సదుపాయం చిన్న ఎస్ఎంఎస్ ద్వారా మనకు మనమే చేసుకోవచ్చు. ఇందుకోసం బ్లాక్ ఆప్షన్‌లోకి వెళ్లి మన డెబిట్ కార్డు చివరి నాలుగు అంకెలు టైప్‌చేసి 09223966666 ఎస్ఎంఎస్ పంపించాలి. దీంతో కార్డు బ్లాక్ అవుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more