లక్ష్ల కోట్లు అన్నారు.. చివరకు చిక్కింది మాత్రం 5 వేల కోట్లే..! Tax department detects undisclosed income of over Rs5,300 crore

Income tax department detects undisclosed income of over rs 5300 cr

Income Tax Department, demonetisation, black money, un-disclosed income, Rs 5,343 crore, india news

The Income Tax department has detected un-disclosed income of over Rs 5,343 crore and seized Rs 114 crore of new notes post demonetisation.

ఆ నిర్ణయంతో కొండను తవ్వి ఎలుకను పట్టారా..?

Posted: 01/10/2017 11:16 AM IST
Income tax department detects undisclosed income of over rs 5300 cr

దేశం నుంచి అవినీతిని, నల్లధనాన్ని పారద్రోలేందుకు కేంద్ర తీసుకున్న పెద్ద నోట్ల నిర్ణయం అశించిన మేర ఫలితాలను ఇవ్వలేదని విమర్శలు వస్తున్న తరుణంలో..పాత పెద్దనోట్ల ఉపసంహరణ ద్వారా అవినీతి, నల్లధనం రూపుమాసిపోదని అర్థిక నిపుణులు కొత్త వాదనను కూడా తెరపైకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో వున్న లక్షల కోట్ల రూపాయల నల్లధనం వినియోగంలోకి రాకుండా చేసేందుకు తాము తీసుకున్న నిర్ణయం దోహదపడుతుందన్న కేంద్రం.. ఈ విసయంలో కొండను తవ్వి ఎలుకను పట్టిందా..? అంటే అవుననే అంటున్నారు విమర్శకులు.

దేశ వ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు తరువాత లక్షల కోట్ల రూపాయల నల్లధనానికి బదులు కేవలం వేల కోట్ల రూపాయల నల్లధనాన్నే అధాయపన్ను శాఖ అధికారులు పట్టుకోవడమే విమర్శలకు తావిస్తుంది. పెద్ద నోట్ల రద్దు తరువాత ఐటీ శాఖ అధికారులు జరిసిన దాడుల్లో రూ.5,343.29 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని గుర్తించారని శాఖకు చెందిన వర్గాలు ప్రకటించాయి.. రూ.611.48 కోట్ల విలువైన ఆభరణాలు, నగదును జప్తు చేశారు. జప్తు చేసిన నగదులో రూ.114.1 కోట్లు కొత్త నోట్ల రూపంలో ఉంది.

నవంబరు 9 నుంచి జనవరి 8 మధ్య అధికారులు ఆదాయపు పన్ను చట్టం కింద 1,156 సోదాలు, సర్వేలు, విచారణలు చేశారు. పన్ను ఎగ్గొట్టడం, హవాలా వ్యాపారం ఆరోపణలపై వివిధ సంస్థలకు 5,184 నోటీసులు ఇచ్చారు. 535 కేసులను సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లకు ఐటీ అధికారులు సిఫార్సు చేశారు. అలాగే నోట్లరద్దు సమయంలో నల్లధనాన్ని దాచుకునేందుకు సహకారబ్యాంకులు బాగా ఉపయోగపడ్డాయని ఐటీ శాఖ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Income Tax Department  demonetisation  black money  un-disclosed income  Rs 5  343 crore  india news  

Other Articles