టాలీవుడ్ నటికీ తప్పని న్యూఇయర్ వేధింపులు Five arrested for molestation of Tollywood actress

Five arrested for molestation of tollywood actress

Tollywood actress, molestation, Prince Anwar Shah Road, south Kolkata, misbehave, Jadavpur police station, New year celebrations, crime news

Five persons have been arrested and a car seized over the molestation of a Tollywood actress outside a bar in south Kolkata on New Year’s eve.

టాలీవుడ్ నటికీ తప్పని న్యూఇయర్ వేధింపులు

Posted: 01/10/2017 08:37 PM IST
Five arrested for molestation of tollywood actress

ఐటీ రాజధానిగా బాసిల్లుతున్న బెంగుళూరు సిలికాన్ వ్యాలీలోనే కాదు నూతన సంవత్సర వేళ.. సంబరాల మాటున వేళ్లూనుకున్న మగమృగాళ్ల జాడ్యం అటు ఫూణేలోనూ ట్రెక్కర్లపై కూడా విరుచుకుపడింది. అయితే ఈ రెండు ఘటనలు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయని అలస్యంగా వెల్లడవుతున్న ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇదే న్యూ ఇయర్ వేడుకల రోజున టాలీవుడ్‌కు చెందిన ఓ నటి కూడా లైంగిక వేధింపులకు గురైంది. ఓ కార్యక్రమంలో పాల్గొని బయటకు వస్తున్న ఆమె పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
డిసెంబర్ 31 రాత్రి పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని దక్షిణ ప్రాంతంలోగల అన్వర్ షా రో్డ్డులో గల ఓ బార్ లో కార్యక్రమాన్ని ముగించుకుని బయటకు వస్తున టాలీవుడ్ నటిని, లగ్జరీ కారులో వచ్చిన కొందరు యువకులు అమెను తన వాహనాన్ని ఎక్కకుండా అడ్డుకున్నారు. అనంతరం ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. తాకరాని చోట్ల అసభ్యంగా తాకుతూ వెకిలి చేష్టలు వేశారు. దీంతో అప్రమత్తమైన నటి గట్టిగా కేకలు వేయడంతో వారు పారిపోయారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ నటి చెప్పిన ఆధారాలు, స్థానికుల సమాచారంతో జాదవ్‌పూర్ పోలీసులు ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు. వీరిని ప్రశ్నించి కోర్టులో ప్రవేశ పెడతామని బెంగాల్ పోలీసులు చెబుతున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles