టోల్ టాక్స్ నుంచి తప్పించే రూ. 2000 నోటు.. ఇలా.. cab drivers plan to avoid paying toll tax with new rs 2000 note

Cab drivers plan to avoid paying toll tax with new rs 2000 note

toll tax, avoid toll tax, demonetisation, cab driver, krish ashok, uber, ola, private cabs, demonetisation news, demonetisation woos

A cab driver ashok sketches a plan to avoid paying toll tax with new rs 2000 note, this is how he implemented his plan

టోల్ టాక్స్ నుంచి తప్పించే రూ. 2000 నోటు.. ఇలా..

Posted: 01/13/2017 09:59 AM IST
Cab drivers plan to avoid paying toll tax with new rs 2000 note

అవినీతి నిర్మూలణ కోసం దేశంలోని పాత పెద్ద నోట్లను రద్దు చేశామన్న కేంద్ర కొత్తగా అంతకన్నా పెద్ద నోటు దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో.. దేశ ప్రజలకు చిల్లర కష్టాలు మొదలయ్యాయి. గడచిన రెండు నెలలుగా భారతీయులను పీడిస్తున్న ప్రశ్న ఇది. చేతిలో పెద్ద నోటున్నా, దాన్ని మార్చుకోలేని పరిస్థితి ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఈ నేపథ్యంలో కొత్త రెండు వేల రూపాయల నోటు వుంటే చాలు.. కొన్నింటి నుంచి ఈజీగా తప్పించుకోవచ్చునన్న అనుభవం ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అనుభవంలోకి వచ్చింది. ఇలాంటి ఒక అనుభవమే ఎదురుకావడంతో.. చెన్నైలో ఎదురైన క్రిష్ అశోక్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్ట చేయడంతో అది కాస్తా విపరీతంగా వైరల్ అయ్యింది.

ఉబెర్ కు చెందిన ఓ క్యాబ్ ను బుక్ చేసుకున్న అశోక్, క్యాబ్ లో వెళుతుండగా, "మీ వద్ద రూ. 2 వేల నోటుందా?" అని అడిగాడు క్యాబ్ డ్రైవర్. వుందని తీసిస్తూనే, "ఎందుకు?" అని ప్రశ్నించారు అశోక్. దానికి "వెయిట్ అండ్ వాచ్" అని చెప్పాడు క్యాబ్ డ్రైవర్. ఆ తరువాత క్యాబ్ ఓ టోల్ బూత్ వద్దకు చేరుకుంది. అక్కడి ఉద్యోగికి క్యాబ్ డ్రైవర్ రూ. 2 వేల నోటిచ్చాడు. దాన్ని చూసిన ఉద్యోగి, చిల్లర లేదా? అని ప్రశ్నించి, నా వద్ద కూడా లేదు. నువ్వెళ్లమని సమాధానం ఇచ్చాడు. పెద్ద నోటుతో చిల్లర సమస్య ఇంకా తీరలేదన్న విషయం క్యాబ్ డ్రైవరుకు తెలుసునని, టోల్ బూత్ వద్ద చెల్లించాల్సిన ఫీజును చెల్లించకుండా ఉండేందుకే అతను రూ. 2 వేల నోటును అడిగాడని తన అనుభవాన్ని అశోక్ తెలిపారు. అశోక్ పోస్టును 2 వేల మందికి పైగా షేర్ చేసుకోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles