తెలుగు ప్రజలకు త్వరలో మరో షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధమౌతోంది. సర్ ఛార్జీల పెంపుతో ప్రజల నడ్డి విరిచేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) ప్రతిపాదనలు చేశాయి. అంతేకాదు బుధవారం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పిస్తూ విద్యుత్ చార్జీలను 3.5 శాతం నుంచి 4 శాతం వరకు పెంచేందుకు అనుమతి కోరాయి. ఆదాయంపై దృష్టి సారించిన డిస్కంలు.. ఎక్కువగా ఉన్నాయని భావించిన వాణిజ్య, పారిశ్రామిక వర్గాల చార్జీలను మాత్రం కొంచెం తగ్గించాలని ప్రతిపాదించగా, నెలవారీ డిమాండ్ చార్జీలను మాత్రం పెంచాలని కోరాయి.
దారిద్ర్య రేఖకు దిగువన ఉండి అధిక విద్యుత్ లోడు కలిగిన వినియోగదారులందరు ఈ భారాన్ని మోయక తప్పని పరిస్థితి నెలకొంది. మరోవైపు విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు మిగిలిన రంగాల వారికి కూడా డిమాండ్ చార్జీని భారీగా పెంచాలని ప్రతిపాదించాయి. ఆ లెక్కన విద్యుత్ వాడినా, వాడకున్నా సామాన్యులను బాదేందుకు సిద్ధమైన డిస్కంలు విద్యుత్ కనెక్షన్ ప్రకారం ఇక నుంచి బిల్లు చెల్లించాల్సిందేనని ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి.
కాగా, గృహరంగంలో ఇలా ప్రతిపాదించడం ఇదే మొదటిసారి. కిలోవాట్, అంతకంటే ఎక్కువ విద్యుత్ లోడ్‌తో కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు ఇది భారం కానుంది. అంటే మొత్తంగా ఐదు కిలోవాట్ల లోడు కలిగిన వినియోగదారులు చార్జీల రూపంలోనే నెలకు రూ.275 చెల్లించాల్సి ఉంటుంది. ఇంట్లో మోటార్, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఇస్త్రీపెట్టె ఉన్న గృహ వినియోగదారులకు మోత మోగనుంది. ఇవి కలిగి ఉన్నవారి విద్యుత్ లోడు ఐదు కిలోవాట్ల వరకు ఉంటుంది కాబట్టి ఆ భారం భరించక తప్పదు. అపార్ట్మెంట్లలో నివసించే వారైతే ఇంతకంటే ఎక్కువ భారాన్నే మోయాల్సి ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలు పెంచడం ఇది మూడోసారి జనంపై భారం 3,359 కోట్లు. ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుమతిస్తే గనుక ఏప్రిల్ నుంచే మోత మోగనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more