కరెన్సీ నోట్ల వర్షం కురిపించిన అసోం ఏటీయం.. ATM in Assam dispenses four times more cash than sought

Atm in assam dispenses four times more cash than sought

atm cash, four times extra cash, jamunamukh, union bank atm, ATM, United Bank of India, demonetisation, note ban, assam

United Bank of India (UBI) ATM in central Assam’s Jamunamukh near the civil hospital dispensed four times more cash than sought.

కరెన్సీ నోట్ల వర్షం కురిపించిన అసోం ఏటీయం..

Posted: 01/19/2017 10:32 AM IST
Atm in assam dispenses four times more cash than sought

రాజస్థాన్‌లోని బ్యాంక్ అప్ బరోడా బ్యాంక్ ఏటీయం పోరబాటున అడిగిన దాని కంటే అధికంగా డబ్బులను విధిల్చిన విషయాన్ని దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించన విషయాన్ని మర్చిపోక ముందే మరో ఏటీయం కూడా కరెన్సీ వర్షాన్ని కురిపించిన ఘటన అసోంలో చోటుచేసుకుంది. రాజస్థాన్ లోని టోంక్ ప్రాంతంలో మూడున్నర వేలు అడిగిన కస్టమర్లకు ఏకంగా డెబై వేల రూపాయలను ఇవ్వగా, సోంలోని జమునాముఖ్ ప్రాంతంలో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఏటీఎం కూడా కస్టమర్లకు అడిగిన దానికంటే నాలుగు రెట్ల డబ్బును ఇచ్చి విస్మయానికి గురిచేసింది.

ఏటీయంలో డబ్బుల వర్షం కురుస్తుందన్న సమాచారం తెలుసుకున్న కస్టమర్లు ఏకంగా క్యూ కట్టి మరీ, డబ్బును తీసుకున్నారు. అయితే పలువురు కస్టమర్లు బ్యాంకు అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా.. వారు  ఏం జరుగుతోందో తెలుసుకునే లోపు ఖాతాదారులు ఏకంగా ఏడు లక్షల రూపాయల మొత్తాన్ని జనం లాగేసుకున్నారు. ఆ ఏటీఎం ఉదారత్వం గురించి ఆనోటా ఈనోటా తెలిసిన జనం.. అక్కడకు వెళ్లి తమ ఖాతాలో ఉన్న మొత్తాన్ని డ్రా చేసుకోడానికి ప్రయత్నిస్తే, దానికి నాలుగు రెట్ల మొత్తం వచ్చింది.  
 
సిస్టం ఎర్రర్ కారణంగా ఇలా జరిగిందని యూబీఐ జమునాముఖ్ బ్రాంచి మేనేజర్ కృష్ణ భౌమిక్ తెలిపారు. ఏటీఎంలోని స్లాట్‌లలో 100, 500, 2000 రూపాయల నోట్లు పెట్టామని, ఒక వ్యక్తి వెయ్యి రూపాయలు కావాలని అందులో ఎంటర్ చేస్తే.. రెండు 500 రూపాయల నోట్లకు బదులు రెండు 2000 రూపాయల నోట్లు వచ్చాయని ఆయన వివరించారు. బ్యాంకు ఉన్నతాధికారులను సంప్రదించాక స్థానిక పోలీసులకు ఈ విషయమై పిర్యాదు చేస్తామని భౌమిక్ చెప్పారు. ఎవరెవరు ఎంతెంత మొత్తం తీసుకున్నారో అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వాళ్ల నుంచి డబ్బులు వెనక్కి తీసుకుంటామని భౌమిక్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles