ములాయం సింగ్ కు జలక్ ఇచ్చిన ముఖ్య అనుచరుడు Mulayam Singh aide Ambika Chaudhary joins BSP

Mulayam singh s aide ambika chaudhary joins mayawati s bahujan samaj party

Mayawati, Bahujan Samaj Party (BSP), Ambika Chaudhary, Mulayam Singh Yadav, Akhilesh Yadav, Samajwadi Party (SP), Election News, Election news 2017, Election Latest News, UP Assembly Elections 2017, Uttar Pradesh Elections News, Uttar Pradesh Assembly Elections 2017 News

Samajwadi Party (SP) leader and Mulayam Singh Yadav's loyalist Ambika Chaudhary joined the Bahujan Samaj Party (BSP) on Saturday in its supremo, Mayawati's presence.

ములాయం సింగ్ కు జలక్ ఇచ్చిన ముఖ్య అనుచరుడు

Posted: 01/21/2017 01:03 PM IST
Mulayam singh s aide ambika chaudhary joins mayawati s bahujan samaj party

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో దేశప్రజలందరి దృష్టి అతిపెద్దదైన ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై వున్న తరుణంలో.. అక్కడి అధికార పార్టీకి మాత్రం గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ తన కోడుకు కోసం తమ్మడు శివపాల్ యాదవ్ ను బలిపశువును చేశారన్న విమర్శలు గుప్పిస్తున్న బీఎస్సీ పార్టీ అధినేత్రి మాయావతి సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ములాయంకు కుడి భుజంగా భావించిన పార్టీ సీనియర్ నాయకుడు అంబికా చౌదరి సమాజ్ వాదీ పార్టీకి రాజీనామా చేసి.. బీఎస్పీలో చేరారు.
 
పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నానని, ఇక తనను తాను పూర్తిగా బహుజన సమాజ్‌ పార్టీకి అంకితం చేసుకుంటున్నానని ఆయన ప్రకటించారు. అయితే ములాయం కుటుంబంలో విబేధాలన్నింటినీ డ్రామాగా అభివర్ణించిన మాయావతితో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పుకోచ్చారు. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో తొలుత వెనకబడిన తరగతులు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన అంబికా చౌదరి.. మరో ఎనిమిది మందితో పాటు ఉద్వాసనకు గురయ్యారు. ఈయన ఒకప్పుడు ములాయంకు సన్నిహితుడిగా ఉండేవారు. కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తి కూడా పార్టీని వీడి వెళ్లిపోవడం ఆయనకు వ్యక్తిగతంగా నష్టమే అవుతుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles