తమిళనాడులో అధికారికంగా జల్లికట్టు క్రీడను రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో నిర్వహించేందుకు వెళ్లిన మధురై చేరువలోని అళంగనలూర్ కు వెళ్లిన ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు చుక్కెదురైంది. జల్లికట్టు ఆటను ప్రారంభించడానికి వీలు లేదంటూ ఆయనకు అడుగడుగునా నిరసనకారులు అడ్డుతగిలారు. ఆర్డినెన్స్ జారీ చేసినా.. తమిళ యువత బెట్టువీడలేదు. శాశ్వత చట్టం చేయాల్సిందేనని పట్టుబట్టి కూర్చొంది. జల్లికట్టు నిర్వహణకు.. శాశ్వత చట్టం కావాలంటూ ఆరురోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు.. ఆందోళనను మరింత తీవ్రం చేశారు.
మదురై జిల్లా అలంగానల్లూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సీఎం పన్నీర్ సెల్వం జల్లికట్టు పోటీలను ప్రారంభించకనే వెనుదిరిగారు. శనివారమే మదురైకి వచ్చిన సీఎం అలంగానల్లూర్కు వెళ్లలేకపోయారు. వాడివాసల్ వద్దకు సీఎం రాకుండా దాదాపు లక్ష మంది యువత ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. జల్లికట్టు అంశంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే.. తమను సంప్రదించకుండా తీర్పును ఇవ్వవద్దంటూ ‘కెవియట్’ పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్డినెన్సను చట్టం చేస్తామని సీఎం పన్నీర్ చెప్పి వెనుదిరిగారు.
జల్లికట్టుపై నిషేధం తొలగిపోయిందని జల్లికట్టు నిర్వహించుకోవచ్చునని ప్రభుత్వం పదే పదే ప్రకటనలు చేసినా జల్లికట్టు నిర్వాహకులు మాత్రం స్పందించలేదు. ఆదివారం రాష్ట్రమంతటా జల్లికట్టు ‘వాడివాసల్’(ఎద్దులను విడిచిపెట్టే వేదిక) తెరచుకున్నా.. ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినా ఆశించిన రీతిలో జల్లికట్టు నిర్వహించలేకపోయారు. చెన్నైలో ‘మెరీనా విప్లవం’ తీవ్రరూపం దాల్చింది. నాలుగు లక్షల మంది విద్యార్థులు, యువకులు, సామాన్య ప్రజలు మెరీనా తీరం పొడవునా కూర్చుని నినాదాలు చేశారు. కాగా, పుదుక్కోట, తిరుచ్చి, మనపారై తదితర ప్రాంతాలలో ఆదివారం జల్లికట్టు నిర్వహించారు. ఈ ప్రాంతాల్లో వందల సంఖ్యలో పోట్ల గిత్తలు పాల్గొన్నాయి.
జల్లికట్టులో అపశృతి .. ఇద్దరు మృతి
రాష్ట్ర ప్రభుత్వం అర్డినెన్స్ ను తీసుకురావడంతో అధికారంగా అదివారం రోజున తమిళనాడులోని పలు ప్రాంతాలలో నిర్వహించిన జల్లికట్టులో తొలిరోజే అపశృతి చోటుచేసుకుంది. పుదుక్కోటలోని మునియాండవర్ ఆలయం వద్ద జరిగిన జల్లికట్టులో ఎద్దులు పొడవడంతో ఇద్దరు యువకులు మైదానంలోనే ప్రాణాలు కోల్పోయారు. తముక్కం మైదానంలో జల్లికట్టు ఆందోళనలో పాల్గొన్న చంద్రమోహన అనే యువకుడు అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాడు. ఆస్పపత్రికి తరలించేలోపే మృతి చెందాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more