ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం కాంగ్రెస్, అధికార సమాజ్ వాదీ పార్టీలు పొత్తుపై ఓ క్లారిటీకి వచ్చాయి. లక్నో లో ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశం తర్వాత ఇరు వర్గాలు కలిసే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. కీలక భూమిక పోషిస్తుందనుకున్న ప్రియాంక స్పందించకపోవటం, చివరకు సోనియానే కలుగజేసుకోవటంతో వారం నుంచి కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. దీనిపై ఇరు వర్గాలు అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ, కూటమి కొనసాగుతుందని అఖిలేష్ ఓ ప్రశ్నకు బదులివ్వటంతో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు ఖరారైనట్లే అనుకోవాలి.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాజ్ బబ్బర్ కూడా అఖిలేష్ తో కలిసి ఎన్నికల్లో పాల్గొనేందుకు అభ్యంతరం లేదని ప్రకటన చేసేశాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మొత్తం 403 సీట్లు ఉన్న యూపీ అసెంబ్లీలో కాంగ్రెస్ 138 సీట్లను కోరగా, 99 మాత్రమే ఇస్తామని చెప్పిన ఎస్పీ చివరకు 110 సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. వీటితోపాటు అఖిలేష్ ఇప్పటికే ప్రకటించిన 200 నియోజక వర్గాల్లో రాయ్ బరేలీ, అమేథీ పరిధిలోని 10 సీట్లకు గానూ ఏడింటిని కాంగ్రెస్ అభ్యర్థులతో భర్తీ చేసేందుకు అంగీకరించింది.
వరుస ఓటములతో రాష్ట్రాలను వరుసగా కొల్పోతూ వస్తున్న కాంగ్రెస్ కు యూపీ ఎన్నికలు చాలా కీలకం. బీజేపీని ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మాను అఖిలేష్ అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని ఎన్నికల్లో దెబ్బకొట్టేందుకు హస్తం తీవ్రంగా యత్నిస్తోంది.
పెద్దాయన పోస్టర్ లేకుండానే...
పార్టీలో ముసలం మరోసారి బయటపడింది. ఆదివారం పొత్తుపై జరిగిన సమావేశంలో ఆసక్తికర పరిణామం సంభవించింది. కాంగ్రెస్ తో పొత్తును మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న పార్టీ పెద్ద ములాయం సింగ్ యాదవ్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్ లలో అఖిలేష్ యాదవ్ తోపాటు రాహుల్ గాంధీ ఫోటోలు ఉండటం కొసమెరుపు. దీనిపై ములాయం మద్ధతుదారులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేయగా, అఖిలేష్ ఆ అంశంపై అస్సలు స్పందించలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more