అవమానిస్తే ఊరుకుంటామా?.. మెడలు వంచి కూర్చోపెడ‌తాం | Pawan kalyan fire on North Indian political elites.

Pawan kalyan tweets on ap demands special status

Pawan Kalyan, Janasena, AP special status, Pawan kalyan Twitter, AP Demands Special Status, Pawan Kalyan peaceful protests, Pawan Kalyan North Indian politics, Pawan kalyan South India, Dravida Culture Pawan Kalyan, Pawan kalyan AP leaders, Pawan kalyan RK beach protest

Janasena Chief Pawan kalyan again tweets on AP Demands Special Status. Does the North Indian political elites know! 'How many languages are there in south'? For them we are all Madrasis!. The muscle called "Courage"& the qualities -"self respect, integrity & accountability" are lacking in political class of AP. Youth of AP"should raise their voice through peaceful protests is the only remedy ,to achieve the promised "SCS".

పవన్ ట్వీట్లు: ఆత్మ గౌరవాన్ని కించపరుస్తుంటే ఊరుకోవాలా?

Posted: 01/23/2017 11:34 AM IST
Pawan kalyan tweets on ap demands special status

ప్రత్యేక హోదాపై గళం విప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ట్వీట్లతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. సోమవారం ఉదయం మరోసారి ట్వీట్లు చేసిన ఆయన ఇచ్చిన మాట నిల‌బెట్టుకోక‌పోతే తిర‌గ‌బ‌డ‌తాం.. అన్న‌ది కేంద్ర ప్ర‌భుత్వానికి ఆంధ్ర‌యువ‌త తెలియజెప్పాలని పిలుపునిచ్చాడు.

గాంధీజీని ప్రేమిస్తాం.. అంబేద్కర్‌ను ఆరాధిస్తాం... సర్దార్ ప‌టేల్‌కి సెల్యూట్ చేస్తాం... భార‌త రాజ్యాంగాన్ని గౌర‌విస్తాం... కానీ త‌ల ఎగ‌రేసే ఉత్త‌రాది నాయ‌క‌త్వం ద‌క్షిణాది ఆత్మ‌గౌర‌వాన్ని కించ‌ప‌రుస్తూ ఉంటే మాత్రం చూస్తూ కోర్చోం.. మెడలు వంచి కూర్చోపెడ‌తాం' అంటూ సినీనటుడు, జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ రోజు ఆవేశంతో కూడిన ట్వీట్ చేశాడు.

విద్యార్థులు పోరాటం జరిపితే వారి వెనుక నేనుంటానని కూడా పవన్ కల్యాణ్ తెలిపారు. ఉత్తరాది పాలకులకు దక్షిణాది ప్రజల గురించి ఏం తెలుసునని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అసలు దక్షిణాదిలో ఎన్ని భాషలు ఉన్నాయో వారికి తెలుసా? అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అడిగిన ఆయన, దక్షిణాదిన ఎన్ని భాషలు ఉన్నాయో కూడా తెలీని వారు మదరాసీలంటూ పిలుస్తూ అవహేళన చేస్తున్నారన్నాడు. ఏపీ రాజకీయ వర్గాల్లో ధైర్యం కొరవడిందని, నాణ్యతలేని రాజకీయాలు చేస్తున్నారని, బాధ్యతతో వ్యవహరించడం లేదని ఆరోపించారు.

"ఆంధ్రప్రదేశ్ యువత తమ గొంతును శాంతియుతంగా వినిపించాలి. అదే సమస్యలు తీరేందుకు పరిష్కారం. వారు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా సాధనకు అదే మార్గం" అని పవన్ ట్వీటారు. జల్లికట్టు పోరాటం నేపథ్యంలో ఆంధ్రప్రజలు స్ఫూర్తిని పొందాలని పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకోవాలని ఇప్పటికే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janasena  Pawan Kalyan  Twitter  AP special status  

Other Articles