ఏపీకి ప్రత్యేక హోదాపై గణతంత్రదినోత్సవం రోజున శాంతియుత నిరసన తెలియజేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలంటూ సోషల్‌మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం సిద్దం కావడం, అనుమతులు లేవని చెప్పడంపై హీరో శివాజీ కాస్త ఘాటుగా స్పందించారు. సీఎం చంద్రబాబును, పోలీసు అధికారులను నిలదీశారు. పవన్ కల్యాన్ లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ పోరబాటున కూడా అధికారంలోకి వచ్చేది కాదని చెప్పారు.
ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయదు. చేసేవాళ్లను చేయనీయకుండా అడ్డుకుంటుంది. ఏమిటండీ ఇది?.. అసలు చంద్రబాబు నాయుడు.. ఆయన మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్టు ఎందుకు ఫీలవుతున్నారో అర్థం కావడం లేదు. ఇది ఆయన మీద పోరాటం కాదండీ.. భావితరాల జీవన్మరణ సమస్య ఇది. ప్రత్యేకహోదా అనేది ఏపీలో ఉన్న ప్రతి బిడ్డ హక్కు. ఈ హక్కు కోసం వాళ్ల నిరసనను తెలియజేయడానికి ఆర్కే బీచ్‌కు వస్తే మీకొచ్చే నష్టం ఏంటండి?’’ అంటూ చంద్రబాబుకు సూటి ప్రశ్నలు సంధించారు.
‘‘పట్టిసీమ, పోలవరం తప్ప ఆంధ్రప్రదేశ్‌లో ఏమైనా జరిగిందా? రాజకీయనాయకులను ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా? ఒకప్పుడు మీరు రైతు వ్యతిరేకి, ఉద్యోగి వ్యతిరేకి అనే ముద్రలు వేసుకున్నారు. ఇప్పుడు యువత వ్యతిరేకి అన్న ముద్ర మాత్రం వేసుకోకండి దయచేసి...అది మీకు మంచిది కాదు. అసలు మీరు వ్యక్తిగతంగా ఎందుకు ఫీలవుతున్నారు? మీకొచ్చిన సమస్య ఏంటి?’’ అని చంద్రబాబును ప్రశ్నించారు.
‘‘మనం శాంతియుతంగా చేయాలనుకున్నప్పుడు సంఘవిద్రోహశక్తులు దాంట్లో దూరతాయి. లేదంటే ఏదో ఒక రాజకీయపార్టీకి చెందినవాళ్లు.. వాళ్ల స్వార్థం కోసం అందులో చేరిపోయి గొడవలు చేస్తే పిల్లలకు ఏమన్నా అవుద్దేమోనని భయపడడంలో తప్పు లేదు. కానీ ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎవరు వచ్చి అడిగారు? అనే ప్రశ్నలు వేసే ముందు.. మీరు ఆంధ్రప్రదేశ్‌కు చెందినటువంటి ఒక బిడ్డ. అది మర్చిపోకండి. శాంతియుతంగా చేయాలనుకుంటున్నప్పుడు.. మా విద్యార్థులకు, మా యువతకు మేం సపోర్ట్ చేస్తామని చెప్పండి. పోలీసులుగా మీ ధర్మం మీరు నిర్వర్తించండి.’’ అని శివాజీ సూచించారు.
‘‘ఎప్పుడో తేలిపోవాల్సిన విషయాన్ని మీరు, వెంకయ్యనాయుడుగారు నీరు గార్చాలని చేసిన ప్రయత్నంలో ఈ రోజున ఏపీలో రాబోయే తరాలన్నీ కూడా నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. ప్రజల మనోభావాలు గుర్తించలేని ఈ ప్రభుత్వాలు ఉంటే ఏంటి? పోతే ఏంటి? ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేయాలనుకున్నప్పుడు అనుమతి ఇవ్వడానికి, ఇవ్వకపోవడానికి మీరెవరు? శాంతియుతంగా చేసుకొనే హక్కు మాకు లేదా? మేము ఓట్లేస్తే గెలిచిన మీరు మాకు నీతులు చెబుతారా? ఈ రోజున రోడ్డు మీద జరిగే వందలాది ప్రమాదాలకు మీరు బాధ్యత వహిస్తారా?’’ అంటూ ఘాటు ప్రశ్నలు వేశారు శివాజీ. మన దగ్గర డబ్బు వచ్చేదాన్ని వదిలేసుకుని ఎవడో పెట్టేదాన్నిగురించి మీరు ఆలోచిస్తున్నారు. మీరు నమ్మినా నమ్మక పోయినా ప్రత్యేక హోదా వల్ల ఏపీకి ఐదేళ్లలో దాదాపు లక్ష కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది. ఆ డబ్బుతో మీరు సింగపూర్ కట్టొచ్చు.. శ్రీలంక కట్టొచ్చు. ఏదైనా కట్టొచ్చు.’’ అని శివాజీ చెప్పాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more