పద్మాల కోసం ఇంకేం చేయాలి.. క్రీడాకారుల నిలదీత.. Pankaj Advani and Jwala Gutta Question Padma Snub

Jwala gutta and pankaj advani question repeated padma award snub

jwala gutta padma shri,jwala gutta padma awards,pankaj advani padma shri,pankaj advani padma awards,Jwala Gutta,Pankaj Advani,vijay goel,union minister,indian civilian awards,jwala gutta padma snub,pankaj advani padma snub,pankaj advani padma bhushan,jwala

Noted billiards and snooker player Pankaj Advani and badminton player Jwala Gutta are quite bitter after being snubbed for the Padma awards once again.

పద్మాల కోసం ఇంకేం చేయాలి.. క్రీడాకారుల నిలదీత..

Posted: 01/26/2017 03:21 PM IST
Jwala gutta and pankaj advani question repeated padma award snub

పద్మ అవార్డులు అందించే ప్రతీ సమయంలోనూ అమెకు నిరాశే ఎదురవుతుంది. దీంతో అమె తన అసహనంతో కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖపై మండిపడుతుంది. అమె మరోవరో కాదు గత 15 ఏళ్లుగా దేశానికి క్రీడారంగంలో సేవలందిస్తున్న ప్రముఖ షెట్లర్ గుత్తా జ్వాల. అయితే ఈ సారి అమెకు మరో క్రీడాకారుడి తోడు కూడా లభించింది, ప్రముక బిలియార్డ్స్ ప్లేయర్ పంకజ్ అద్వాని. పద్మ అవార్డులపై అసంతృప్తిని వెళ్లగక్కుతూ గత 15 ఏళ్లుగా దేశం కోసం ఆడుతున్నానని... ఎన్నో ప్రతిష్టాత్మక టోర్నమెంట్లలో సత్తా చాటానని... అయినప్పటికీ తనను పద్మ పురస్కారానికి ఎంపిక చేయలేదని ప్రముఖ షట్లర్ గుత్తా జ్వాల ఆవేదన వ్యక్తం చేసింది.

పద్మ పురస్కారం కోసం ఇప్పటికే మూడు సార్లు దరఖాస్తు చేశానని... అయినా కావాలనే తనను విస్మరించారని ఆరోపించింది. అన్ని అర్హతలు ఉన్నాయన్న భావనతోనే పద్మ అవార్డులకు దరఖాస్తు చేశానని... కానీ అవి వారికి సరిపోలేదని చెప్పింది. పద్మ అవార్డులు రావాలంటే రికమెండేషన్ కావాలని తెలిపింది. రెకమెండేషన్ ఉంటేనే అవార్డుకు ఎంపిక చేస్తామనేటప్పుడు... దరఖాస్తులను ఎందుకు ఆహ్వానించాలని ప్రశ్నించింది. తాను సాధించిన విజయాలు పద్మ పురస్కారానికి సరిపోవా? అని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళల డబుల్స్ లో తాను అందరికీ మార్గదర్శకంగా నిలిచానని చెప్పింది. తాను ముక్కుసూటిగా ఉండటం వల్లే తనకు అవార్డును నిరాకరిస్తున్నారని ఫేస్ బుక్ లో తెలిపింది.

ప్రముఖ బిలియర్డ్స్ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం పద్మవిభూషణ్ అవార్డుల్లో తనపేరు పరిగణనలోకి తీసుకోకపోవడంపై మండిపడ్డాడు. ఈ మేరకు ట్విట్టర్లో స్పందించిన అద్వానీ  ‘కృతజ్ఞతలు సర్‌. 16 ప్రపంచ టైటిళ్లు, ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు సాధించా. ఐనా పద్మభూషణ్‌కు నన్ను పక్కన పెడుతున్నారంటే ఇంకా నేనేం సాధించాలో అర్థంకావడం లేదు’ అని ట్వీట్‌ చేశాడు. కాగా, గత ఎనిమిదేళ్లుగా వరుసగా ప్రపంచ టైటిళ్లు అందుకొంటున్న పంకజ్‌ అద్వానీకి పద్మభూషణ్‌ పురస్కారం ప్రకటించాలని కర్ణాటక ప్రభుత్వం, భారత బిలియర్డ్స్‌, స్నూకర్‌ సమాఖ్య కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి. అయినప్పటికీ కేంద్రం అతనిని పరిగణనలోనికి తీసుకోకపోవడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : padma awards  Jwala Gutta  Pankaj Advani  vijay goel  indian civilian awards  padma bhushan  

Other Articles