తమిళనాడులో ఓ కాలేజీ యాజమాన్యం తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఏకంగా టాయ్ లెట్ లలో సీసీ కెమెరాలు అమర్చింది కళాశాల యాజమాన్యం. దీనిపై తల్లిదండ్రులు సహా అంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము ఆ పని చేయడానికి ఓ కారణం ఉందంటూ వారు చెబుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్లితే... తమిళనాడు కోయంబత్తూరులోని కోవైపుదూరులో వీఎల్బీ జానికియమ్మాళ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఉంది. దానికి మేనేజ్ మెంట్ ఈ మధ్యే మరుగుదొడ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. అంతేకాదు అందులోకి వెళ్లే విద్యార్థులు తప్పనిసరిగా ప్యాంట్లు విప్పేసి వెళ్లాలి. ఊరికే కాదు లేండి అక్కడున్న లుంగీని కట్టుకుని వెళ్లాలంటూ ఆంక్షలు విధించింది. ఈ మేరకు వారం క్రితం కళాశాల ప్రిన్సిపాల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సర్వత్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే టాయిలెట్లలో తామేం ఊరికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని ప్రిన్స్ పాల్ చెబుతున్నారు. ఇటీవల స్టాఫ్రూంలో ఉన్న టాయిలెట్లో కొంత మంది తుంటరి విద్యార్థులు నాటు బాంబు పెట్టారని, అది పేలి తొండైతున్నె అనే లెక్చరర్ తీవ్రంగా గాయపడ్డాడని, అందుకే ఈ ఏర్పాటు చేశామని చెబుతున్నాడు. ఏది ఏమైనా మరీ టాయిలెట్లలో సీసీ కెమెరాలు ఏంటంటూ నిలదీస్తున్నారు. ఈ విషయం కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more