ఒక్కటైన రెండు టెలికాం దిగ్గజ సంస్థలు.. Vodafone dials Idea for merger

Vodafone confirms idea merger talks could create india s biggest telecom firm

Vodafone, Vodafone Group, Idea Cellular, merger, Vodafone Idea merger, Vodafone India, Aditya Birla Group, Reliance Jio, Airtel, telecom, india news

Consolidation in India’s $27 billion telecom industry received a massive boost with Vodafone Group Plc confirming that it is in talks for a merger of its Indian unit with Aditya Birla Group’s Idea Cellular Ltd.

ఒక్కటైన ఆ రెండు టెలికాం దిగ్గజాలు.. జియోకు చుక్కలు

Posted: 01/30/2017 07:27 PM IST
Vodafone confirms idea merger talks could create india s biggest telecom firm

ఇండియ‌న్ టెలికం రంగంలో పెరుగుతున్న పోటీతో కంపెనీలు విలీనం దిశగా అడుగులేస్తున్నాయి, కొత్తగా టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన జియో వ‌రుస ప్రీ ఆఫ‌ర్ల‌తో మిగిలిన టెలికం కంపెనీల‌కు చుక్క‌లు చూపిస్తోన్న క్రమంలో ఇక ఒక్కటి కాక తప్పని పరిస్థితులు ఉత్పన్నం కావడంతో రెండు దిగ్గజ కంపెనీలు ఏకమయ్యాయి. గత కొన్నాళ్లుగా వోడాఫోన్ ఫలానా కంపెనీతో కలుస్తుందని ఊహాగానాలు తెరతీశాయి. ఈ క్రమంలో ముందుగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ పేరు వినిపించింది.

కాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఏయిర్ సెల్ ను విలీనం చేసుకునే చర్యలు ప్రారంభం కావడంతో వోడాఫోన్ ఎవరిలో విలీనం అవుతుందన్న వార్తలు తెరపైకి వచ్చాయి, తీరాచూస్తు అ అవకాశాన్ని అందుకున్న అదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన ఐడియా. ఈ విషయాన్ని వొడాఫోన్ ఈ రోజు స్పష్టం చేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌లో వొడాఫోన్‌కు చెందిన అన్ని షేర్లను కలిపేందుకు చర్చలు జరుపుతున్నట్టు పేర్కొంది. బ్రిటిష్ కంపెనీ అయిన వొడాఫోన్, అదిత్యా బిర్లా గ్రూప్‌కు చెందిన ఐడియా ప్రస్తుతం భారత్‌లో వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఈ రెండు టెలికం సంస్థ‌లు క‌లిస్తే ఇండియ‌న్ టెలికం మార్కెట్లో నెంబ‌ర్ వ‌న్ ప్లేసులో ఉన్న ఎయిర్‌టెల్‌తో పాటు జియోకు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని నిపుణులు చెబుతున్నారు. ఆ రెండు బలపడడం వల్ల ఎయిర్‌టెల్ మూడో స్థానానికి పడిపోతుందని విశ్లేషిస్తున్నారు. అంతేకాదు నంబర్ వన్ స్థానానికి చేరుకోవాలన్న జియో ఆశలు కూడా నెరవేరవని చెబుతున్నారు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ 27 కోట్లమంది వినియోగదారులతో అగ్రస్థానంలో ఉంది. ఐడియా-వొడాఫోన్ ఒక్కటైతే వాటి మొత్తం వినియోగదారుల సంఖ్య 39 కోట్లకు చేరుకుంటుంది. ఇక రియలన్స్ జియో ప్రస్తుత వినియోగదారుల సంఖ్య 7.2 కోట్లు. ఆఫర్ ముగిశాక ఎంతమంది ఆ నెట్‌వర్క్‌ను కొనసాగిస్తారో చెప్పలేని పరిస్థితి. దీంతో ఈ లెక్క‌న వోడాఫోన్‌+ఐడియా విలీనం జియో, ఎయిర్‌టెల్‌కు షాక్ ఇచ్చేలాగానే క‌నిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vodafone  Idea Cellular  Aditya Birla Group  Reliance Jio  Airtel  telecom  

Other Articles