అమెరికా వలస వెళ్లేవాళ్లకు కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద షాకే ఇచ్చాడు. అమెరికా ఫస్ట్ అంటూ ముందు నుంచి చెప్పుకుంటున్నట్లు అన్నంతపనే చేసేశాడు. ఇతర దేశాల నుంచి వచ్చే వారిని కట్టడి చేసేందుకు కొత్త చట్ట రూపకల్పనకు సిద్ధమయ్యాడు. హెచ్-1 బీ వీసాదారులను అడ్డుకునేందుకు కొత్త చట్టం తీసుకొచ్చేందుకు బిల్లు రూపకల్పన చేసేశాడు. కంపెనీలు స్థానికులకే అవకాశాలు కల్పించాలని బిల్లులో ప్రతిపాదన చేశాడు. అంతేకాదు వీసాలపై ప్రస్తుతమున్న నిబంధనలను కఠినాతి కఠినం చేస్తూ తయారు చేసిన బిల్లును ప్రతినిధుల సభకు పంపాడు కూడా.
హెచ్1-బీ వీసాలపై ఉద్యోగులను తీసుకు వచ్చే కంపెనీలు చెల్లించాల్సిన 60 వేల డాలర్ల వేతనాన్ని ఏకంగా 1.30 లక్షలకు పెంచారు. 1989 నాటి వీసా నిబంధనలే ఇప్పటికీ అమలవుతున్నాయని, వీటిని సవరించాల్సిన సమయం వచ్చిందని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. తన నిర్ణయంతో వీసా దరఖాస్తులు తగ్గుతాయని, మరింత మంది అమెరికన్లకు ఉపాధి లభిస్తుందని, వెంటనే ఈ బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నాడు.
కాగా, 'ది హై-స్కిల్డ్ ఇంటిగ్రిటీ అండ్ ఫెయిర్ నెస్ యాక్ట్ ఆఫ్ 2017' పేరిట తయారైన ఈ బిల్లును కాలిఫోర్నియా కాంగ్రెస్ మెన్ జోయ్ లాఫ్ గ్రీన్ సభలో ప్రవేశపెట్టారు. మార్కెట్ ఆధారిత డిమాండ్ ఆధారంగా వీసాలను జారీ చేయాలని ప్రతిపాదించాడు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలతో పోలిస్తే 200 శాతం వరకూ కంపెనీలు ఇవ్వగలవని తమ సర్వేలో తేలిందని, అయినప్పటికీ, తక్కువ వేతనాలకు విదేశీయులను తెస్తూ, ఇక్కడి వారికి కంపెనీలు అన్యాయం చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. అమెరికా ప్రతినిధుల ముందుకు వచ్చిన ఈ బిల్లు ఇప్పుడు భారత ఐటీ కంపెనీల్లో పెద్ద దెబ్బ వేసింది. ప్రో12201, ఇన్ఫోసిస్-33289, డెలాయిట్-7606 ఐగేట్-4553 ఇలా పెద్ద సంఖ్యలోనే ఉద్యోగులపై ప్రభావం పడనుంది. అంతేకాదు తాజా నిర్ణయంతో షేర్లు భారీగా పడిపోయాయి కూడా. మరోవైపు చట్టంలో శిక్షణా వీసాలను సైతం పొడగింపుకు అవకాశం లేకుండా నిర్ణయాలు ఉన్నట్టు తెలుస్తోంది. హెచ్1బీ వీసాలు పొందిన భర్త లేదా భార్యకు వర్క్ పర్మిట్ తొలగించడం వంటి ప్రతిపాదనలు కూడా ఈ ముసాయిదాలో ఉన్నాయి. దినసరి వేతనంలతో పని చేస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారయినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రతి యేటా అమెరికా 85 వేల హెచ్1-బీ వీసాలను ఇస్తుండగా, ఇందులో సింహభాగాన్ని అంటే, దాదాపు 80 శాతానికి పైగా వీసాలు భారత్ కే దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తన కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేస్తే, భారత కంపెనీలకు పెనునష్టమే. వీసాల విధానంలో సంస్కరణలు తెస్తూ తయారైన ముసాయిదా సిద్ధమైందని ట్రంప్ అధికార ప్రతినిధి సీన్ స్పిసర్ వెల్లడించారు. దేశ వీసా విధానాన్ని, ఇమిగ్రేషన్ పాలసీలను సమూలంగా మార్చి అమెరికన్లకు మేలును కలిగించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు.
మరిన్ని కఠిన నిర్ణయాలు...
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఆ దేశంలోకి ప్రవేశించాలనుకుంటున్న విదేశీయులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. విదేశీ పౌరులపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా సన్నాహాలు చేసుకుంటోందని వైట్‌హౌస్ పాలసీ డైరెక్టర్ స్టీఫెన్ మిల్లర్ తెలిపారు. అమెరికాకి వచ్చే విదేశీయులు వారి ఫోన్ నంబర్లను, సామాజిక మాధ్యమాల వివరాలను, ఇంటర్నెట్‌లో వారు శోధించిన అంశాల గురించి తెలిపే బ్రౌజింగ్ హిస్టరీని తమకు అందజేయాలనే షరతులను విధించనున్నట్లు చెప్పారు.
విదేశీయులు ఒకవేళ ఈ సమాచారం ఇవ్వడానికి ఒప్పుకోకపోతే వారిని తమ దేశంలోకి అనుమతించబోమని తెలిపారు. దీనిపై చర్చలు ప్రారంభించినట్లు తెలిపారు. అయితే, విదేశీయులకు సంబంధించి ఈ అంశాలు సేకరించడం అన్యాయమని నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీ(ఎన్‌ఎస్ఏ) మాజీ సీనియర్ లాయర్ ఆప్రిల్ దాస్ అన్నారు. ఈ చర్యలు వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని చెప్పారు. గూగుల్ సీఈవో, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్, సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ మౌంటేన్ వ్యూ ర్యాలీలో ప్రసంగించారు. ర్యాలీలో పాల్గొన్న తమ ఉద్యోగులందరికీ వారు కృతజ్ఞతలు తెలిపి, ట్రంప్ తీరుపై ఈ యుద్ధాన్ని ఇలానే కొనసాగించాలని, రాజీ పడకూడదని వ్యాఖ్యానించారు.
అటార్నీ జనరల్ తొలగింపు...
వాషింగ్టన్: తన ఆదేశాలను బేఖాతరు చేసిన అటార్నీ జనరల్ సల్లీ యేట్స్‌ను తొలిగించారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. అమెరికా పౌరుల రక్షణ కోసం రూపొందించిన న్యాయపరమైన ఆదేశాన్ని అమలు చేసేందుకు అటార్నీ జనరల్ నిరాకరించింది. దీంతో ప్రెసిడెంట్ ట్రంప్ ఆమెపై వేటు వేసినట్లు వైట్‌హౌజ్ ప్రకటించింది. ఇమ్మిగ్రేషన్ నిషేధాన్ని ప్రశ్నించినందుకు ఆమెను తొలిగించినట్లు తెలుస్తున్నది. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనా సమయంలో సల్లీ యేట్స్ నియామకం జరిగింది. ముస్లిం శరణార్థులను అడ్డుకోవాలంటూ ట్రంప్ జారీ చేసిన ఫర్మానాను అమలు చేయవద్దంటూ అటార్నీ జనరల్ సల్లీ న్యాయశాఖ లాయర్లను ఆదేశించింది. దీంతో ఆమెను విధుల నుంచి బహిష్కరిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అటార్నీ జనరల్ సల్లీ యేట్స్ న్యాయశాఖను మోసం చేసిందని వైట్‌హౌజ్ ఓ ప్రకటనలో అభిప్రాయపడింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more