బీజేపీ హటావో నినాదాన్ని నెత్తిన వేసుకుని యూపీలో సమాజ్ వాదీ పార్టీతో చేతులు కలిపిన కాంగ్రెస్ కు అనుకోని చిక్కులు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె దూరంగానే ఉంటారన్న విధంగా ఆమె కార్యాలయం నుంచి సంకేతాలు వెలువడ్డాయి.
దీంతో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న రాహుల్ కే పూర్తి పగ్గాలు అప్పగించినట్లు అయ్యింది. రాహుల్ తోపాటు, తనయ ప్రియాంక, ముఖ్యమంత్రి అఖిలేష్ తో కలిసి ప్రచారంలో పాల్గొనబోతున్నారు. గతేడాది వారణాసిలో ఓ రోల్ షోలో కుప్పకూలిన సోనియా తర్వాత నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఆ మధ్య జరిగిన సీడబ్య్లూసీ భేటీ కూడా రాలేనని తేల్చి చెప్పింది కూడా. అయితే కేవలం అనారోగ్య సమస్యలే ఇందుకు కారణం కాదని సమాచారం. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న యూపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం చెందటం, పైగా ఇప్పుడు పార్టీకి ఏమంత సానుకూలత లేకపోవటంతోనే ఆమె ఆసక్తి చూపటంలేదని తెలుస్తోంది.
ఇక ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీకి పెద్ద దిక్కు అయిన ములాయం సింగ్ యాదవ్ తాను ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయనని తేల్చి చెప్పేశారు. ఆయన వ్యాఖ్యలతో ఎస్పీ, కాంగ్రెస్ లు షాక్ కు గురయ్యాయి. ఇప్పుడు తాజాగా సోనియాగాంధీ కూడా ప్రచారం చేయబోరనే సంకేతాలు వెలువడటంతో, కేవలం గ్లామర్ నే వాడుకుని ముందుకు వెళ్లబోతుందా? యువనేతల ఆధ్వర్యంలోని కూటమి ప్యూహం ఎలా ఉండబోతుందో చూడాలి.
మరోసారి ముసలం...
ఇదిలా ఉంటే ముసలంకు సూత్రధారి అయిన ములాయం సింగ్ సోదరుడు శివపాల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాదీ పార్టీలో రాజకీయ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎస్పీ నుంచి పోటీ చేస్తున్న శివపాల్ యాదవ్ కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శివపాల్ యాదవ్ మాట్లాడుతూ.. త్వరలోనే కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. మార్చి 11 తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీ తరపున పోటీ చేసినప్పటికీ కొత్త పార్టీ పెడుతానని స్పష్టం చేశారు. తిరుగుబాటు నేతలతో కలిసి పార్టీ ఏర్పాటు చేస్తానన్నారు. తనను బలహీనపరిచేందుకే తన అనుచరులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more