జ‘గన్’ మాత్రమే పేలుస్తాడని రాంగోపాల్ వర్మ ట్విట్, Ram Gopal Varma Tweets on YS jagan

Ram gopal varma tweets on ys jagan

andhrapradesh, ramgopal varma, ys jagan, loaded gun, chandra babu, pawan kalyan, ysrcp, jana sena, politics

controversial director ram gopal varma tweets on ysrcp party chief ys jagan says, he is the only man who fires the loades gun to solve all the problems of AP

జ‘గన్’ మాత్రమే పేలుస్తాడని రాంగోపాల్ వర్మ ట్విట్

Posted: 02/02/2017 11:03 AM IST
Ram gopal varma tweets on ys jagan

నిన్న మొన్నటి వరకు కేవలం సినిమాలకు, సినిమా స్టార్ లకు సంబంధించి ట్విట్లు చేసి.. వివాదాస్పద దర్శకుడిగా పేరుతెచ్చుకున్న రాంగోపాల్ వర్మ.. ఇక తాజాగా రాజకీయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సమాకాలిన రాజకీయాలపై అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై కూడా ఆయన ఇటీవల ట్విట్లు చేశారు. ఈ విషయంలో ప్రముఖ హీరోను ఆయన టార్గెట్ చేసిన విషయం కూడా తెలిసిందే.

అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాన్ ను ప్రశంసించిన ఆయన.. హీరో లేకుంటే.. ఉద్యమం చప్పగా సాగుతుందని కూడా గణతంత్ర దినోత్పవం రోజున హోదా నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేసిన నేపథ్యంలో పేర్కోన్న విషయం కూడా తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై తన ట్విట్టర్ ద్వారా ఎక్కుపెట్టారు. అయితే అందర్నీ విమర్శలతో టార్గెట్ చేసే ఆర్బీవీ.. జగన్ పై మాత్రం ప్రశంసలు కురిపించారు.

ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక చిత్ర పటాన్ని (మ్యాప్) తుపాకీతో పోల్చుతూ కామెంట్లు చేశాడు. పేలేందుకు సిద్ధంగా ఉన్న తుపాకీలా ఏపీ మ్యాప్ ఉందని తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అలాగే 'ఆంధ్రప్రదేశ్‌ అనే తుపాకీని పేల్చి, దాని సమస్యలను తీర్చగలిగేది వైఎస్సార్సీపీ అధినేత జగనే' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఆయన ఒక్కసారిగా జగన్ ను ప్రశంసించడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి కొందరు మాత్రం వర్మ నేడు పొగిడాడంటే, రేపు తెగుడుతాడని, జగన్ ను ఎలా తెగుడుతాడో చూడాలని ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhrapradesh  ramgopal varma  ys jagan  loaded gun  chandra babu  pawan kalyan  ysrcp  jana sena  politics  

Other Articles