సకల చరాచర ప్రాణికోటికీ ప్రత్యక్ష దైవమైన, సౌర మండలాధిపతి.. అదిత్యుడు (సూర్య భగవానుడు) చైతన్య ప్రదాత. మాఘ శుక్ల సప్తమి పుణ్యదినంలో ఆయన జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. సూర్య భగవానుడు జన్మించిన రోజుననే సప్త అశ్వములతో రథాన్ని అధిరోహించి సకల చరారచ జీవరాసులున్న ధరణికి మొట్టమొదటగా దర్శనమిచ్చినట్లు మత్స్య పురాణం ఊటంకిస్తుంది. సూర్యభగవానుడి జన్మదినాన్నే పురాణకాలం నుంచి రధసప్తమిగా హైందవ భక్తులు పండుగను చేసుకుంటారు.
భువిపైనున్న జీవరాశులన్నింటికీ దక్షిణాయంలో వున్న శీతల వాతావరణాన్ని పారద్రోలి.. ఉత్తరాయనంలో తన కాంతితో నూతనోత్తేజం నింపే పర్వదినమని ఇతిహాసాలు పేర్కోంటున్నాయి. త్రిమూర్తుల ఏకరూపమైన సూర్యుడు.. బహు శక్తిశాలి అని.. ఆయనను ఉపాసించి ఆరాధించడం వల్ల ఆరోగ్యం కలుగుతుందని, సమస్త జీవజాలం రోగబాధల్ని నివారించగల వైద్యుడు సూర్యుడేనని ‘సూర్యదేవతా సూక్తం’ వివరిస్తుంది. చర్మసంబంధ బాధలు, రక్తహీనత వంటి వ్యాధులకు సూర్యకిరణ చికిత్స నివారణోపాయమని భక్తులు విశ్వసిస్తుంటారు.
రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవెల్లిలో సూర్యభగవానుడి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం అర్థరాత్రి ఆదిత్యుని నిజరూప మూర్తికి శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ క్షీరాభిషేకం, ప్రథమ అర్చనలు చేశారు. ఇవాళ సూర్యభగవానుడు భక్తులకు నిజరూప దర్శనంతో అనుగ్రహంచనున్నారు. కాగా రథసప్తమి రోజున తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి సూర్యభగవానుడి జన్మతిధి రోజున అయనకు ఇచ్చిన మాట ప్రకారం భక్తులకు ఏడు వాహనాల సేవలతో అభయప్రధానం చేయనున్నారు.
మొదటగా సూర్యప్రభ వాహనంపై శ్రీవారు తిరుమాడ విధుల్లో సంచరించిన తరువాత చిన్న శేషవాహనం, చంద్రప్రభ వాహనం, గరుడ వాహనం ఇలా ఏడు వాహనలపై తిరుమాడ విధుల్లో సంచరించి భక్తులను అనుగ్రహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలోనే తిరుమాడ విధుల్లో సంచరించే శ్రీవారు.. ఒక్కో రోజు ఒక్కో వాహనంపై భక్తులకు అభయప్రధానం చేయగా, రథ సప్తమి ఒక్కరోజ మాత్రమే ఏడు వాహనాల సేవలపై విహరించనున్నారు. అలాగే తిరుపతిలోని దక్షిణ మాడా వీధిలో కొలువై ఉన్న కోదండ రామమూర్తిని కూడా సూర్యప్రభ వాహనంపై ఊరించారు.
రథసప్తమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలలోని భక్తులు వేకువ జామునుంచే ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. సూర్యభగవానుడి జన్మ తిథి అయిన రథ సప్తమి పురస్కరించుకుని శ్రీసీతారామచంద్రమూర్తి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రఘుకుల నందనుడు శ్రీరాముడు కూడా సూర్యభగవానుడి అంశంలోనే జన్మించడంతో భక్తులు శ్రీరాముడని ఇవాళ ప్రత్యేకంగా కొలుస్తుంటారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో కూడా రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.స్వామివారికి అర్చకులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more