కొత్త వంద నోట్లు వచ్చేస్తున్నాయ్.. మరి పాత వాటి పరిస్థితి? | RBI issuing smaller denomination notes.

Rbi to soon put new rs 100 banknotes in circulation

Reserve Bank of India, RBI New Notes, RBI 2017 Notes, New Rs 100 Notes, New Hundred Rupees Notes, New Smaller Denomination Notes, Demonetization, New Notes in India, India Old Notes, RBI Smaller Notes

Reserve Bank of India will soon put into circulation new Rs 100 banknotes; The new notes will be similar to the design of the ones in Mahatma Gandhi Series-2005. The year of printing '2017' will be on the reverse of the banknote.

వంద నోట్లను కూడా రద్దు చేస్తున్నారా?

Posted: 02/04/2017 07:54 AM IST
Rbi to soon put new rs 100 banknotes in circulation

పెద్ద నోట్ల రద్దు తర్వాత అందరికీ ప్రియమైపోయిన వంద నోట్లు కొరతగా ఉన్నాయంటూ బ్యాంకింగ్ వర్గాలు గగ్గోలు పెట్టడంతో ఆర్బీఐ రంగంలోకి దిగింది. త్వరలోనే కొత్త వంద నోట్లను అందుబాటులోకి తీసుకువస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘గతంలో విడుదల చేసిన మహాత్మా గాంధీ సిరీస్-2005 వంద నోట్ల డిజైన్ మాదిరిగానే ఈ కొత్త వందనోట్లు కూడా ఉంటాయి. నోట్ల నంబర్ ప్యానెల్స్ లో ఇన్ సెట్ లెటర్ ‘R’, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం, నోటు వెనుక 2017లో ముద్రించినట్టుగా ఉంటుంది’’ అంటూ అందులో తెలిపింది.

ఆల్రెడీ ముద్రణ అయిపోగా, ఈ కొత్త నోట్లను త్వరలోనే బ్యాంకులకు పంపుతామని సంకేతాలు పంపింది. గతంలో విడుదల చేసిన వందనోట్లు అన్నీ చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. వందో నోట్లతోపాటు చిన్న నోట్లను కూడా కొత్తవి విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. నవంబర్ 8 2016 న డీమానిటైజేషన్ ప్రకటన తర్వాత 500 మరియు 1000 నోట్లు పనికి రాకుండాపోగా, కొత్త నోట్లు జారీచేయటంలో కేంద్రం ఆలసత్వం ప్రదర్శించింది.

కేవలం 2000 నోటు ఒక్కటే అందుబాటులోకి రావటం, ఉన్న వంద నోట్లు చాలకపోవటంతో ప్రజలు ‘చిల్లర’ కష్టాలు ఎదుర్కున్నారు. దీనిపై రాజకీయ నేతలు, ఆర్థిక వేత్తలు కూడా ఆర్థికశాఖపై మండిపడిన విషయం తెలిసిందే. అయతే ఓవైపు నల్లధనం నిర్మూలనను చేపడుతూనే సమస్యను పరిష్కారం మెల్లిమెల్లిగా చేస్తున్నామంటూ కేంద్ర చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో పరిస్థితి నానాటికీ మాములు అవుతున్న క్రమంలో విత్ డ్రా పరిమితులను ఎత్తేస్తూనే, ఇప్పుడు కొత్త వంద నోట్ల జారీకి సిద్ధమౌతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  New Notes  100 Rupees  

Other Articles