అమ్మ మృతిపై అన్ని విషయాలు చెప్పేస్తా..! will reveal every thing in jayalalithaa treatment, says Prathap Reddy

Will reveal every thing in jayalalithaa treatment says prathap reddy

Jayalalithaa, vidyasagar rao, Jayalalithaa news, Jayalalithaa latest news, Jayalalithaa death news, aiims, aiims doctors, tamil nadu AIADMK, jayalalithaa Health, Jayalalithaa, apollo hospital, chairman pratap reddy, Richard John Beale, States, Tamil Nadu

Apollo Hospitals Chairman Prathap C. Reddy debunked reports as rumours devoid of any truth reports that the legs of former chief minister J. Jayalalithaa were amputated due to diabetic related complications before her death on December 5 last year.

అమ్మ మృతిపై అన్ని విషయాలు చెప్పేస్తా..!

Posted: 02/04/2017 12:38 PM IST
Will reveal every thing in jayalalithaa treatment says prathap reddy

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంపై అన్ని విషయాలను తెలిపేందుకు తాను సిద్దంగా వున్నానని ప్రకటించారు అపోలో గ్రూపు హాస్పిటల్స్‌ చైర్మన్ డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి. అస్వస్థతకుగురై ఆస్పత్రిలో చేరి, 74 రోజుల చికిత్స తరువాత తీవ్రమైన గుండెపోటు రావడంతో డిసెంబర్‌ 5న కన్నుమూశారు. అయితే ఆమెకు అందించిన చికిత్సపై సొంత పార్టీ ఏఐడీఎంకేలోని కొందరు నాయకులు, జయలలిత మేనకొడలు దీపా సహా ప్రతిపక్ష డీఎంకే సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

డీఎంకే చీఫ్‌ కరుణానిధైతే ఒక అడుగు ముందుకేసి జయ ఫొటోలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కానీ ఎలాంటి ఫొటోలు విడుదలకాకుండానే జయ పరమపదించారు. ఆమె మరణానంతరం చికిత్సకు సంబంధించిన కొన్ని వివరాలను ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ కొంతమంది ఈ విషయంపై మాట్లాడుతూనే ఉన్నారు. అలాంటి వాళ్లందరికీ సమాధానంగా జయకు చికిత్స అందించిన అపోలో ఆస్పత్రుల చైర్మన్‌ ప్రతాప్‌.సి.రెడ్డి జయలలిత మరణంపై అన్ని విషయాలను తాను చెప్పేందుకు సిద్దంగా వున్నానంటూ సంచలన ప్రకటన చేశారు.

జయలలిత మరణానికి సంబంధించిన విచారణలో పూర్తి వివరాలను అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. డయాబిటీస్ వ్యాధి బారిన పడిన అమె కాళ్లను చికిత్సలో భాగంగా తొలగించామన్న వాదనలు ఆయన తిప్పికోట్టారు. ఇలాంటి అర్థరహితమైన వార్తలను ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదని, అయతే జయలలిత మరణంలో అన్ని విషయాలు తెరచిన పుస్తకంలా ట్రాన్స్పరెంట్ గా వున్నాయన్నారు.

జయలలిత చికిత్సకు సంబంధించిన విషయంలో అపోలో అస్పత్రి తరపున ఎలాంటి విచారణకైనా తాను సిద్దంగా వున్నానని, ఎక్కడికైనా వచ్చి అమెకు అందించిన చికిత్స వివరాలను స్పష్టంగా తెలియజేస్తామని చెప్పారు. సెప్టెంబర్ 22న తమ అస్పత్రికి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి.. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ నుంచి కొలుకున్నారని.. అంతా సవ్యంగా వుండి మరికొన్ని రోజుల్లో అమె డిశ్చార్జ్ అవుదామని భావించిన సమయంలో తీవ్రమైన గుండెపోటుకు గురై అమె పరమపదించారని ప్రతాప్ రెడ్డి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalithaa  pratap reddy  karunanidhi  apollo hospitals  chennai  tamil nadu  

Other Articles