పార్టీ నేతలు కావాలో.. పీఏ కావాలో తెల్చుకోమంటూ తేల్చుకోవాలంటూ అసమ్మతి నేతలంతా నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యకు డెడ్ లైన్ విసిరిన విషయం తెలిసిందే. దీంతో తన వ్యక్తిగత సహాయకుడు చంద్రశేఖర్ నాయుడు(శేఖర్)పై వస్తున్న ఆరోపణలకు బాలకృష్ణ స్పందించారు. షాడో ఎమ్మెల్యేగా మారి తన నియోజకవర్గంలో పెత్తనం చలాయిస్తున్న అతడిపై వేటేసినట్టు తెలుస్తోంది. రెండున్నరేళ్లుగా బాలకృష్ణకు పీఏగా ఉన్న శేఖర్, పార్టీ సీనియర్ నేతలైన మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట్రాముడు, సీనియర్ నేత అంబికా లక్ష్మీనారాయణ వంటి వారిని కూడా పట్టించుకునే వాడు కాదని, అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడంటూ విమర్శలు ఉన్నాయి. బాలయ్య పీఏ కొంప ముంచేశాడు
బాలకృష్ణ మూడు నెలలకు ఓసారి నియోజకవర్గానికి రావడం, ఉన్న రెండు మూడు రోజులు ఊపిరి సలపని కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో శేఖర్ చెలరేగిపోయినట్టు సమాచారం. పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తూ వచ్చిన శేఖర్ చిలమత్తూరు మండలంలో కొందరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించడం, లక్ష రూపాయల పనికి రూ.10 వేల చొప్పున వసూలు చేస్తున్నట్టు శేఖర్‌పై ఆరోపణలొచ్చాయి. దీంతో ఆయన ఆగడాలు భరించలేని పార్టీ కార్యకర్తలు వెంకట్రాముడుతో మొరపెట్టుకున్నారు. ఆయన రంగంలోకి దిగినా శేఖర్ ప్రవర్తన మారకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా గళమెత్తారు.
మరోవైపు కొందరిని అనుచరులుగా చేసుకుని శేఖర్ కలిసి లేపాక్షిలో సొంతంగా ర్యాలీ కూడా నిర్వహించారు. దీంతో పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరి శేఖర్ వ్యవహారం అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. పైగా కాంట్రాక్టర్లను బెదిరిస్తూ అడ్డంగా మీడియాకు దొరికిపోవటం, దీనిపై స్పందించటం లేదంటూ పత్రికల్లో వరుస కథనాలు రావటంతో బాలయ్య తన వేగుల ద్వారా దీనిపై సమగ్ర సమాచారం తెప్పించుకున్నట్టు తెలిసింది.
అనంతరం అవన్నీ నిరూపితం కావటంతో అతనిని విధుల నుంచి తొలగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రూపులను తాను సహించబోనని, పార్టీకి ఎవరైనా ఒకటేనని, తానైనా, నాయకులైనా, కార్యకర్తలైనా సమానమేనని బాలకృష్ణ పేర్కొన్నట్టు తెలిసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడంట. మరోవైపు నేడు(మంగళవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో శేఖర్ వ్యవహారంపై కీలక నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
పీఏను తొలగించండి:చంద్రబాబు
ఇక హిందూపురం పార్టీలో వివాదాలకు కారణమైన బాలకృష్ణ పీఏ శేఖర్‌ను వెంటనే తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించాడు. పార్టీలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించరాదని, అందరూ ఏకతాటిపై నడవాలని, గ్రూపు రాజకీయాలకు కారణమైన ఎవరినీ పార్టీ క్షమించదని చంద్రబాబు హెచ్చరించాడు. హిందూపురం టీడీపీలో కొద్దిరోజులుగా రగులుతున్న అసమ్మతి సెగ ఆ పార్టీ అధిష్ఠానాన్ని తాకింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ తన పీఏ శేఖర్‌ను తొలగిస్తూ హిందూపురం వదిలి వెళ్లిపోవాలని సోమవారం రాత్రే ఆదేశించారు.
దీంతో సోమవారం అర్ధరాత్రి హిందూపురం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.మంగళవారం ఉదయం బాలకృష్ణ, నారా లోకేష్ ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితిని వివరించగా, పీఏని వెంటనే తొలగిస్తూ వెంటనే ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more