ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న శశికళ కల.. కలగానే మిగిలిపోతుందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్ ఆమెపై సంచలన ఆరోపణలు చేశాడు. పోయిస్ గార్డెన్ లోని తన నివాసంలో జయలలితను ఎవరో కిందకు పడదోశారని, తీవ్రగాయాల పాలైన ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్టు నాటకమాడి, ఆమెను హత్య చేశారంటూ వ్యాఖ్యలు చేసి తీవ్ర కలకలం సృష్టించాడు.
మంగళవారం ఉదయం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పోయిస్ గార్డెన్ లో జయలలితతో వాదన పెట్టుకున్న ఒకరు, ఆమెను గట్టిగా నెట్టి కిందకు పడదోశారని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 22న ఈ ఘటన జరిగిందని, ఆ సమయంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. జయలలిత మరణం తరువాత శశికళ కనీసం విచారాన్ని వ్యక్తం చేయలేదని పాండియన్ నిప్పులు చెరిగారు. భవిష్యత్తులో శశికళకు సీఎం అయ్యే అవకాశాలు వస్తాయన్న అనుమానం జయలలితకు ఉండేదని, అలా జరగడం తనకు ఇష్టం లేదని జయలలిత ఓ సారి తనతో చెప్పారని పాండియన్ కుమారుడు, మాజీ ఎంపీ మనోజ్ వ్యాఖ్యానించారు.
జయలలిత మృతి వెనుక ఎలాంటి వివాదాలు లేవని లండన్ వైద్యుడు రిచర్డ్ బేలె వెల్లడించిన మరుసటి రోజు పాండియన్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై డీఎంకే మరింత ముందుకు వెళ్లాలని భావిస్తోంది. తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించాలనుకుంటున్న శశికళ నిర్ణయానికి వ్యతిరేకత తెలుపుతూ రేపు ఆ పార్టీ నేతలు ఢిల్లీకి బయలుదేరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవాలని నిర్ణయించుకున్నారు.
మరోవైపు గవర్నర్ కూడా సహకరించకపోవటం, దీనికి తోడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అన్నాడీఎంకే నేతల సంఖ్య రాను రాను పెరిగిపోతుండటం పెను సంక్షోభం దిశగా తమిళ రాజకీయం అడుగు వేస్తుందన్న భయం వ్యక్తం చేస్తున్నారు అక్కడి రాజకీయ నిపుణులు. ఒకవేళ అదే జరిగితే ఎన్నికల వరకు రాష్ట్రపతి పాలన ఖాయంగానే కనిపిస్తోంది. చూద్దాం ఏం జరగబోతుందో?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more