న్యాయ వ్యవస్థ చరిత్రలోనే తొలిసారిగా ఒక హైకోర్టు న్యాయమూర్తి బోనులో నిలబడాల్సి వస్తుంది. ఆయనపై కోర్టు ధిక్కార నోటీసులను కూడా జారీ చేసింది. ఎందుకని కోర్టు ధిక్కారణ కింద కేసులు నమోదు చేయకూడదు.. ఎందుకని మీపై చర్యలకు ఉపక్రమించకూడదో చెప్పాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏకంగా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి కే నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులపై తమ ఎదుట స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని కూడా అదేశాలలో పేర్కోంది. చీఫ్ జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
జస్టిస్ కర్నన్‌ను గత ఏడాది ఫిబ్రవరిలో మద్రాసు హైకోర్టు నుంచి కోల్‌కతా హైకోర్టుకు బదిలీ చేశారు. అయితే ఈ బదిలీపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన తాను దళితుడిని కాబట్టే సాటి న్యాయమూర్తులు తనను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. అదే సందర్భంగా తాను భారత లాంటి దేశంలో జన్మించినందుకు సిగ్గుపడుతున్నానని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. కుల వ్యవస్థ లేని మరో దేశానికి వెళ్లిపోవాలని తాను అనుకుంటున్నట్లు కూడా వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తన బదిలీ ఆదేశాలపై తానే ‘స్టే’ ఇచ్చుకున్నారు.
ఈ ‘స్టే’ను సుప్రీంకోర్టు వెంటనే ఎత్తివేసింది. ఆయనను అన్ని రకాల విధుల నుంచి పక్కన పెట్టాలని ఆదేశించింది. ఇది జరిగిన వారం రోజుల తర్వాత సుప్రీంకోర్టుకు జస్టిస్ కర్నన్ వివరణ ఇచ్చుకున్నారు. ‘‘మానసిక నిస్పృహ కారణంగా మతి స్థిమితం కోల్పోయి తప్పుడు ఆదేశాలు జారీ చేశాను. క్షమించండి’’ అని కోరడంతో... సుప్రీంకోర్టు జస్టిస్ కర్నన్‌కు తిరిగి విధులు అప్పగించింది. అయితే... మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా భారత ప్రధాన న్యాయమూర్తికి, ప్రధాన మంత్రికి, మరికొందరికి జస్టిస్ కర్నన్ రాసిన లేఖలు ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి.
ఈ లేఖల్లోని అంశాలను ‘కోర్టు ధిక్కరణ’గా పరిగణించవచ్చునని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఏకంగా జస్టిస్ కర్నన్‌కు నోటీసులు జారీ చేసింది. ‘‘కోర్టు ధిక్కరణ కింద మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు! ఈనెల 13వ తేదీలోపు వివరణ ఇవ్వండి. తదుపరి విచారణకు మీరు స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది’’ అని ఆదేశించింది. అంతేకాదు... న్యాయమూర్తిగా అన్ని రకాల విధులకు దూరంగా ఉండాలని తెలిపింది. జస్టిస్ కర్నన్‌పై సుమోటోగా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయాలని, ఈ నోటీసు ఆయనకు అందేలా చూడాలని కోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. దీనిపై ఈనెల 13న విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more