హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్లు దుమ్మురేపారు. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరును సాధించిన టీమిండియా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఛటేశ్వర్ పూజరా 83 పరుగుల వద్ద ఔట్ కాగానే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ మురళీ విజయ్తో కలసి బంగ్లా బౌలర్ల పంబరేపాడు. వరుసగా నాలుగు టెస్టు సిరీస్ లలో నాలుగు డబుల్ సెంచరీలని నమోదు చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఔట్ అయ్యి వెనుదిరిగాడు.
బంగ్లాతో జరుగుతున్న ఏకైక టెస్టులో తొలిఇన్నింగ్స్ ను 687 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో ఆరుగురు బ్యాట్స్ మెన్ ను భారత్ కోల్పోయింది. మన బ్యాట్స్ మెన్ చెలరేగి ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ 204 పరుగులు చేసి విశ్వరూపం ప్రదర్శించగా... మురళీ విజయ్ 108, సాహా 106 (నాటౌట్) పరుగులతో బంగ్లా బౌలర్లను బెంబేలెత్తించారు. వీరికి అండగా పుజారా (83), రహానే (82), జడేజా (60), అశ్విన్ (34) పరుగులు చేశారు. ఓపెనర్ రాహుల్ మాత్రమే కేవలం 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దురదృష్టవశాత్తు ఔట్ అయ్యాడు.
టీమిండియా బ్యాట్స్ మెన్లను బంగ్లా బౌలర్లు ఏ తరుణంలో కూడా ఇబ్బంది పెట్టలేక పోయారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3, మెహెది హసన్ మిరాజ్ 2, టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తీశారు. కాగా, ఈ టెస్టు ద్వారా టీమిండియా అరుదైన రికార్డును సోంతం చేసుకుంది. రెండు రోజైన శుక్రవారం టీమిండియా స్కోరు 600 పరుగులకు చేరగానే ఈ ఘనత సాధించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో వరుస మ్యాచ్‌ల్లో 600, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక జట్టుగా టీమిండియా రికార్డు సాధిచింది. భారత్ ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆ జట్టుపై రెండు సార్లు, ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగ్లాపై ఒకసారి 600 అంతకంటే ఎక్కువ పరుగులు చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more