ట్రావెల్ బ్యాన్ లాంటి వివాదాస్పద నిర్ణయంతో ప్రపంచాగ్రహానికి గురవుతున్న అమెరికన్ ప్రెసిండెంట్ డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన రెండు వారాలకే తీవ్ర నిరసనలు ఎదుర్కుంటున్నాడు. ఓవైపు నిషేధం సరికాదంటూ కోర్టులన్నీ వ్యతిరేకంగా తీర్పులు వెలువరిస్తున్నా... సొంత పార్టీయే ట్రంప్ ను దించేసేందుకు తెర వెనుక యత్నాలు చేస్తుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దేశ భక్తి పేరుతో తిక్క నిర్ణయాలు తీసుకుని అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అసహనం తారాస్థాయిలో చేరిందనే నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలు వివిధ రకాలుగా తమ అసహనాన్ని, ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్, అసభ్యపదజాలంతో పోస్టర్లు వెలవటం చూశాం. ఇక ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్లి చెడు కార్యక్రమాలకు, రోగాలకు ఆయన పేరు పెడుతూ కసి తీర్చుకుంటున్నారు. 24 ఏళ్ల ఎలీసే స్టేపుల్టన్ అనే యువతి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు హాడ్జ్కిన్ లొఫోమా అనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించారు. చికిత్సలో భాగంగా కణతిని తగ్గించేందుకు ఎలీస్‌కు వైద్యులు కీమో థెరపీ చేశారు. దీంతో యువతి జుట్టు మొత్తం రాలిపోయింది. అయినా ఎలీస్ ఏమాత్రం బాధపడడం లేదు. పైగా నవ్వులు చిందిస్తోంది.
ఇక తనను అంతగా ఇబ్బందులకు గురిచేసిన ఆ కణతికి డొనాల్డ్ ట్రంప్ అని పేరు పెట్టింది. ట్రంప్ లాగే అది కూడా చాలా అసహ్యమైనదని, పనికిమాలినదని పేర్కొంది. ఇది మనిషిని యాతన పెడుతుందని చెబుతూ పరోక్షంగా ట్రంప్‌ను దుమ్మెత్తి పోసింది. అంతేకాదు కాన్సర్ డే సందర్భంగా ఓ బ్లాగ్ ను కూడా క్రియేట్ చేసి వైరల్ చేస్తోంది. దీంతో ఆమె సెన్సాఫ్ హ్యుమర్ కి అంతా హాట్సాఫ్ చెబుతున్నారు. మరోవైపు చర్మ వ్యాధులకు, సుఖరోగాలకు కొందరు ట్రంప్ పేరును పెట్టి పిలుస్తూ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ఫ్లోరిడాలో ఓ ప్రాంతంలో డ్రైనేజీ క్లీనింగ్ కార్యక్రమానికి ట్రంప్ పేరునే వాడుకోవటం, ట్రంప్-కంపు పేరిట కథనం మీడియాలో ప్రసారం అవుతుండటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more