సివంగిని.. ఎవరికీ తలవంచను.. జైలు నాకు కొత్తేం కాదు: చిన్నమ్మ | Sasikala Natarajan on Jail life.

Sasikala natarajan emotional speech

Sasikala Natarajan, Sasikala Emotional, Sasikala Press Meet, Sasikala Crocodile Tears, Sasikala Amma Last Words, Sasikala Jayalalithaa's Last Words, Sasikala Resort MLAs, Sasikala Natarajan, Jayalalithaa Last Words

An emotional Sasikala says O Panneerselvam destroying AIADMK. CM Panneerselvam says ‘shedding crocodile tears won’t help’.

ఎవరికీ తలవంచను: శశికళ ఎమోషనల్ స్పీచ్

Posted: 02/13/2017 09:16 AM IST
Sasikala natarajan emotional speech

తమిళనాడులో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తనకు తగినంత మద్దతు ఉందంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ పదే పదే ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి మహాబలిపురం సమీపంలోని కువత్తూరు గోల్డెన్ బే రిసార్ట్స్‌లో తన ఎమ్మెల్యేలతో సమావేశమైన అనంతరం మీడియా ముందకు వచ్చారు. జైలు జీవితం తనకు కొత్తకాదని, బెంగళూరు జైలు కూడా తనకు పాతదేనని కూడా వ్యాఖ్యానించటం కొసమెరుపు.

జయలలితతో కలిసి తాను ఎన్నో కష్టాలు అనుభవించానని, తనకు వ్యతిరేకంగా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ధైర్యంగా ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడున్న మీరంతా సింహాలేనని పేర్కొన్న శశికళ తనను తాను కూడా ఓ సివంగిలా అభివర్ణించుకున్నారు. మనం భయపెట్టాలి తప్ప భయపడకూడదన్నారు. ‘అమ్మ’ మనకు అప్పగించిన అధికారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కన్నీళ్లను దిగమింగుతూ చెప్పుకొచ్చింది.

పార్టీని కాపాడుకోవడానికి తన జీవితాన్ని అయినా సరే అర్పిస్తానని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ అన్నారు. తాను ఎవ్వరికీ తలవంచనని, పన్నీర్ సెల్వం పార్టీకి ద్రోహం చేశారని, అన్నాడీఎంకేను చీల్చేందుకు పన్నీర్ వర్గం కుట్ర పన్నిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసి ముచ్చటగా మూడోసారి అధికార పగ్గాలు చేపడదామని పిలుపునిచ్చారు. పన్నీర్ సెల్వం తన కుట్రలతో పార్టీకి కళంకం తెచ్చారని మండిపడ్డారు. తన ముందున్న 125 మంది ఎమ్మెల్యేలే తనకు కోటిమందితో సమానమని శశికళ పేర్కొన్నారు. ప్రతిపక్ష డీఎంకేపైనా నిప్పులు చెరిగిన శశికళ అక్కడ ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో తనకు తెలుసని పేర్కొన్నారు. ఆ పార్టీలో ఉన్న తనవాళ్లు కానీ, మరెవరైనా కానీ కుట్రలు చేస్తే ధైర్యంగా ఎదుర్కొందామని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.

చిన్మమ్మ టచ్ చేసింది...

చనిపోయే ముందు జయలలిత చెప్పిన ఆఖరి మాటలు ఏంటో ఎవరికీ తెలియదు. ఈ విషయంపై వైద్యులు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఆఖరి నిమిషాల్లో ఆమె పక్కన ఉణ్న నిశ్చెలి శశికళ మాత్రం ఆ విషయం తనకు తెలుసంటూ చెప్పుకొచ్చింది. ''మన పార్టీని ఏ ఒక్కరూ నాశనం చేయలేరు'' అన్నదే అమ్మ చివరి మాట అని, ఆ మాటలను ఆమె తనతో చెప్పారని శశికళ అన్నారు. అందుకే పార్టీని కాపాడేందుకు కావాలంటే తాను ప్రాణత్యాగం కూడా చేస్తానని తెలిపారు.

పార్టీనే మనకు ఆస్తిగా అమ్మ ఇచ్చారని, దాన్ని తీసుకుని తీరాలని ఎమ్మెల్యేలతో ఆమె చెప్పారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలలో ఎవరూ పెద్దగా చదువుకోకపోయినా.. ఒకరోజు వాళ్లు ఎమ్మెల్యేలు అయ్యేలా జయలలితే వారికి శిక్షణ ఇచ్చారని, ఆమె చేసిన సేవలు మర్చిపోవద్దని వారితో అన్నారు. అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా ఇప్పటికీ ఏడుపు వస్తుందని, ఆమెతో పాటు ఎమ్మెల్యేలు కూడా తన మీద చాలా బాధ్యత పెట్టారని, దాన్ని నెరవేర్చి తీరుతానని శపథం చేశారు. అయితే దీనిపై అంతే వేగంగా రియాక్ట్ అయ్యాడు పన్నీర్ సెల్వం. మొసలి కన్నీళ్లకు కరిగిపోయే వారు లేరంటూ కౌంటర్ వేశాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK  Sasikala Natarajan  Press Meet  

Other Articles