శశి జైలు కెళ్తే గతి ఏంటి?.. సెల్వం సపోర్ట్ తగ్గలేదు | Jail or CM Chair for Sasikala Natarajan.

People in tiruppur constituency support to panneerselvam

Golden Bay beach resort, AIADMK MLAs, Sasikala Natarajan, MLAs Resort Bill, Sasikala CM, Chinamma CM, Sasikala Natarajan, Panneerselvam Supporters, Varma Tweets Sasikala, Sasikala Successor

All Tamil Nadu Eyes on Supreme Court verdict. Will it be jail or chief minister's crown for Sasikala in DA Case,

చిన్నమ్మ ఎమ్మెల్యేలకు సాలిడ్ హెచ్చరిక

Posted: 02/14/2017 10:24 AM IST
People in tiruppur constituency support to panneerselvam

మెజారిటీ ఎమ్మెల్యేలు చిన్నమ్మ శశికళకే మద్ధతు ఇస్తున్నప్పటికీ, ప్రజల నుంచి మాత్రం ఇప్పటికీ పన్నీర్ సెల్వంకు విపరీతమైన మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో శశికళకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలకు ఊహించని షాక్ తగిలింది. తిరుప్పూరు నార్త్ ఎమ్మెల్యే విజయకుమార్, తిరుప్పూరు సౌత్ ఎమ్మెల్యే గుణశేఖరన్ లకు స్థానిక అన్నాడీఎంకే నేతలు, ప్రజలు వార్నింగ్ ఇచ్చారు. శశికళకు అనుకూలంగా వ్యవహరిస్తే, నియోజకవర్గంలోకి అడుగు కూడా పెట్టలేరంటూ హెచ్చరించారు.

దివంగత జయలలితకు నమ్మిన బంటు అయిన పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించాలని వారు విన్నవించారు. లేని పక్షంలో పరిస్థితి దారుణంగా ఉంటుందని... ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకుండా చేస్తామని చెప్పారు. మరోవైపు సోషల్ మీడియాలో హీరో అయిపోయిన సెల్వంకు రాను రాను ప్రజా మద్ధతు పెరిగిపోతుంది. మరో ఎమ్మెల్యే, ఎంపీ కూడా ఆయనకు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఓపీఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. దక్షిణ మధురై ఎమ్మెల్యే శరవణన్, మధురై ఎంపీ గోపాలకృష్ణన్ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇక కోలీవుడ్ నుంచి కూడా సపోర్ట్ బాగానే లభిస్తోంది. జల్లికట్టు ద్వారా తమిళ తంబీలకు పెద్దన్నగా మారిపోయిన నటుడు రాఘవ లారెన్స్ పన్నీర్ సెల్వంను కలిసి మద్ధతు ప్రకటించాడు కూడా.

ఎమ్మెల్యే రిసార్ట్ ల బిల్లు ఎంతంటే...

గడచిన వారం రోజులుగా తమిళనాడు రాజకీయాలకు కేంద్రంగా నిలిచిన గోల్డెన్ బే రిసార్ట్స్ లో శశికళ వర్గానికి వేసిన బిల్లు దాదాపు కోటి రూపాయలకు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. వంద మందికి పైగా ఎమ్మెల్యేలు, వారికి కాపలాగా మరో 200 మంది బౌన్సర్లు, వారందరికీ మూడు పూటలా భోజనాలు, ఆపై విందు వినోదాలు, పార్టీలు... ఇలా వీళ్లకు సకల మర్యాదలూ అందించినందుకు బిల్లు ఇలా తడిసిమోపెడయింది.

వాస్తవానికి ఈ రిసార్టులో మూడు రకాల గదులున్నాయి. రోజుకు రూ. 5,500 అద్దెతో ట్రాంక్విల్ రూములు, రూ. 6,600 అద్దెతో బే వ్యూ రూములు, రూ. 9,900 అద్దెతో పారడైజ్ సూట్ రూములూ ఉన్నాయి. మొత్తం 60 గదులనూ బుక్ చేసుకుంటే, ఈ ఆరు రోజులకూ రూ. 25 లక్షల బిల్లు వస్తుంది. ఇక దీంతో పాటు తిండి, తిప్పల ఖర్చు కలిపితే, మరో రూ. 25 లక్షలు అవుతుంది. ఆపై ఎమ్మెల్యేలు, అక్కడున్న ఇతర శశికళ వర్గం వారికి కొత్త దుస్తుల నుంచి కోరిన అన్ని సదుపాయాలనూ కల్పించారు. ప్రత్యేక సేవలు కావాలని కోరిన వారికి అవి కూడా సమకూర్చారు.

ఇలా వారం రోజులకు కోటి రూపాయల వరకూ ఖర్చు దాటిపోయినట్టు తెలుస్తోంది. మరిక ఈ బిల్లులను ఎవరు భరిస్తున్నారో, డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందోనన్న విషయం అనుమానాస్పదమే! ఇంతలా ఖర్చు చేస్తుందంటే ఆమె ఎంత అధికార దాహంతో రగిలిపోతుందో అర్థం చేసుకోవాలంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

 

రిసార్ట్ లో ఎమ్మెల్యేలకు మసాజ్ లు

 

జైలు కెళ్తే ఏంటి పరిస్థితి..

పరిస్థితులు అనుకూలంగా లేక తాను జైలుకు వెళ్లాల్సి వస్తే, తదుపరి అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా ఎవరిని నియమించాలన్న విషయంలో శశికళ మంతనాలు చేస్తున్నారు. సెంగొట్టయ్యన్, ఎడప్పాడి పళనిస్వామి, తంబిదురైలలో ఒకరిని నియమించాలని భావిస్తున్నట్టు తన మనసులోని మాటను ఎమ్మెల్యేల ముందు వెల్లడించారు శశికళ. గత రాత్రంతా ఎమ్మెల్యేలతో కలసి గోల్డెన్ బే రిసార్ట్స్ లో బసచేసిన ఆమె, నేడు తీర్పు వెల్లడైన తరువాతనే తదుపరి కార్యాచరణకు దిగనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రిసార్ట్ లో ఉన్న పలువురు ఎమ్మెల్యేలకు అస్వస్థతగా ఉన్నట్లు సమాచారం.


వర్మ మళ్లీ ట్వీట్...

ఓవైపు సుప్రీం తీర్పు కోసం తమిళనాడుతోపాటు దేశమంతా ఆసక్తి గా చూస్తున్న తరుణంలో వివాదాల వర్మ మరోసారి తమిళ రాజకీయాలపై ట్వీట్ ఏశాడు. ఈసారి శశికళను ఉద్దేశించి ఓ డబుల్ మీనింగ్ డైలాగ్ తో వేసిన ట్వీట్ రచ్చ చేస్తోంది. గత రాత్రి ఎమ్మెల్యేలు చేజారుకుండా వారితో చర్చించిన చిన్నమ్మ అక్కడే సేదతీరింది. దీంతో తాను మీడియాలో ఓ హెడ్డింగ్ ను చూశానంటూ ట్వీట్ వేశాడు వర్మ. శశికళ ఈ రాత్రి వంద మంది ఎమ్మెల్యేలతో గడపబోతుందంటూ ఓ ఛానెల్ వారు ప్రసారం చేస్తున్నారు. సిగ్గుచేటు అంటూ తనదైన శైలిలో ఓ ట్వీట్ చేశాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Panneerselvam  Sasikala Natarajan  

Other Articles