సెల్వం నెత్తిన పన్నీరు.. చిన్నమ్మ మిగిలింది కన్నీరు Decks cleared for Panneerselvam as Sasikala convicted

Decks cleared for panneerselvam as sasikala convicted

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, VK Sasikala, disproportionate case, O.Panneerselvam, supreme court, vidyasagar rao, PM modi, Governor, tamil politics

AIADMK general secretary VK Sasikala suffered a major jolt with the Supreme Court upholding the trial court's judgment, celebrations begin in Panneerselvam camp

సెల్వం నెత్తిన పన్నీరు.. చిన్నమ్మ మిగిలింది కన్నీరు

Posted: 02/14/2017 11:13 AM IST
Decks cleared for panneerselvam as sasikala convicted

తమిళనాట క్షణక్షణం మారుతున్న రాజకీయ సమీకరణలు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు తీర్పుతో కొత్త మలుపు తీసుకున్నాయి. ఇప్పటికే ఒక్కక్కరుగా ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతుతో పాటు పార్టీ కీలక నేతల మద్దతును కూడగట్టుకుంటూ బలాన్ని పెంచుకుంటున్న పన్నీరుసెల్వం క్యాంపులో ఒక్కసారిగా సంబరాలు మిన్నంటాయి. 21 ఏళ్ల క్రితం నాటి అక్రమాస్థుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వికే శశికళను అత్యున్నత న్యాయస్థానం దోషిగా తేల్చింది. అమెతో పాటు అమె బంధువులైన ఇరళవరసి, సుధాకరన్ లను కూడా దోషిగా తేల్చింది.

జయలలిత ముఖ్యమంత్రిగా కొనసాగిన 1991-96 హాయంలో అమెతో పాటు శశికళ, అమె బంధువులు ఇరళవరసి, సుధాకరన్ లు 66.65 కోట్ల రూపాయల అక్రమాస్థులను కూడబెట్టుకున్నారని అభియోగాలపై కర్ణాటక దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్ధించింది. ఈ కేసులో స్వర్గీయ జయలలిత సహా నిందితులను నిర్దోషులుగా తేల్చిన కర్ణాటక హైకోర్టు తీర్పును కొట్టివేసిన సుప్రీం ద్విసభ్య ధర్మాసనం.. వారిని దోషులుగా నిర్ధారించింది.

శశికళ సహా అక్రమాస్థుల కేసులో నిందితులైన వారిని నాలుగు వారాల్లో లోంగిపోవాలని పినాకీ చంద్రభోష్, అమితారాయ్ లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అదేశించింది. సుప్రీకోర్టు ఈ తీర్పును వెలువరించగానే గోల్డన్ బే రిసార్టులో ఉద్విగ్న వాతావరణం అలుముకోగా, అటు పన్నీరు సెల్వం శిబిరంలో మాత్రం అనందోత్సాహాలు అంబరాన్ని తాకాయి. దీంతో ముఖ్యమంత్రి కావాలన్న చిన్నమ్మ ఆశలపై సుప్రీంకోర్టు తీర్పు నీళ్లు చల్లగా, అటు పన్నీరు సెల్వం నెత్తిన మాత్రం పన్నీరును చల్లింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles