తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు తాజాగా ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎన్నిక చెల్లదంటూ జాతీయ ఎన్నికల సంఘాన్ని పన్నీర్ సెల్వం తరఫున ఎంపీ వి. మైత్రేయన్ ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమిషన్ శుక్రవారం ఆమెకు నోటీసులు ఇచ్చింది.
ఈసీ జారీ చేసిన నోటీసులపై ఈ నెల 28లోపు వివరణ ఇవ్వాలని అందులో ఆదేశించింది. మరోవైపు శనివారం అసెంబ్లీలో జరిగే బల నిరూపణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పళనిస్వామికి వ్యతిరేకంగా అన్ని విపక్షాలు ఏకమయ్యాయి. కాంగ్రెస్ రేపు ఉదయం సీఎల్పీలో చర్చించిన తరువాత ఈ విషయమై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోనుంది. జైలుకు వెళ్లే కొద్ది గంటల ముందు శశికళ దినకరన్‌ను అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. దీంతో ఎలాగైనా పార్టీని శశికళ కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్లనివ్వకూడదని పన్నీర్ సెల్వం ప్రతిన బూనారు.
దీంతో చిన్నమ్మకు వ్యతిరేకంగా పన్నీర్ వర్గం ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎం మైత్రేయన్ సహా మరో 11 మంది అన్నాడీఎంకే నేతలు ఎన్నికల సంఘం అధికారులను కలసి తమ పార్టీ నియమనిభంధల ప్రకారం ఆరు సంవత్సరాలు వరుసగా పార్టీలో సభ్యత్వం వుంటేనే వారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కాగలరని అయితే శశికళ 2011లో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారని పన్నీరువర్గం నేతలు ఈసీకి వివరించారు. దీంతో అమెకు ఎన్నకల కమీషనర్ నోటుసులు అందించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more