తమిళనాడులో మళ్లీ రాజకీయం వేడెక్కింది. జయలలిత మరణంతో ఖాళీ అయిన పార్టీ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి స్థానాలను దక్కించుకోవడానికి పన్నీరు సెల్వం వర్గం, పళనిస్వామి వర్గం మధ్య తీవ్ర ఉత్కంఠకు తెరపడుతూ పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం, విశ్వాస పరీక్ష నెగ్గిడం అంతా చకచక జరిగిపోయాయి, ఈ తరుణంలో అసెంబ్లీలో డీఎంకే పక్ష నేత స్టాలిన్ ఓ అడుగుముందుకేసి మరీ విశ్వాసపరీక్షను వాయిదా వేయాలని, రహస్య ఓటింగ్ చేపట్టాలని పట్టబట్టిన నేపథ్యంలో ఇక అక్కడ మళ్లీ అధికార, విపక్షాల మధ్య రాజకీయ రగడ రాజుకుంది.
పళనిస్వామి అధికారం చేపట్టి 24 గంటలు కూడా గడవకముందే చెన్నై పోలీసులు డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్‌పై కేసు నమోదు చేయడంతో ఇక శాంతి నెలకొంటుందని భావించిన తరుణంలో మరోమారు రాజకీయ వేడి రాజకుంది. అసెంబ్లీ నుంచి రాజ్ భవన్ కు వెళ్లి అక్కడి నుంచి నేరుగా పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మెరీనా బీచ్‌లోని గాంధీ విగ్రహం ముందు ఆందోళన నిర్వహించినందుకు గాను ఆయనపై కేసు నమోదు చేశారు, అయితే అందోళన చేయడమే కాకుండా మెరినీ బీచ్ వద్ద నానా రచ్చచేసినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు.
డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌కు శాసనసభలో అవమానం జరిగిందన్న సమాచారం తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. చిరిగిన చొక్కాతో స్టాలిన్ మీడియా ముందుకు రావడాన్ని చూసి డీఎంకే శ్రేణులు తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలతో ఆందోళనలు చేపట్టాయి. నిరసనలు మిన్నంటాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ రాస్తారోకోలు, ధర్నాలకు దిగడంతో వాతావరణం వేడెక్కింది. చెన్నై, మదురై, కోయంబత్తూరు, ఈరోడ్, నామక్కల్, తిరునల్వేలి, తిరుచ్చిల్లో భారీ ఎత్తున నిరసనలు రాజుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు.
మరోపక్క, అసెంబ్లీ నుంచి నేరుగా ఎనిమిదిమంది ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన స్టాలిన్ అసెంబ్లీలో తనకు జరిగిన అవమానం, మార్షల్స్ దురుసుతనం గురించి గవర్నర్‌కు ఫిర్యాదు చేసి మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు, పార్టీ ఎంపీలతో కలిసి స్టాలిన్ నిరసన చేపట్టారు. దీనికి మద్దతుగా జల్లికట్టు తరహాలో జనాలు రావడంతో బుజ్జగించిన పోలీసులు ఆయనను అరెస్టు చేయకుండా పంపించేశారు. అనూహ్య గందరగోళానికి తెరతీసిన స్టాలిన్‌పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more