ఎస్బీఐ ఏటీయం నుంచి రెండు వేల రూపాయల నకిలీ నోట్లు Rs 2000 Notes By 'Children Bank of India'

Fake rs 2000 notes from children bank of india at delhi sbi atm

Delhi ATM dispensing fake notes, Children Bank of India, Sangam Vihar ATM, fake rs 2000 notes, 2000 notes, Delhi police, Delhi, transaction, fake currency, fake currency racket busted, crime news

At a time when many people are struggling to withdraw cash, a State Bank of India ATM in South Delhi's Sangam Vihar dispensed fake Rs 2,000 notes.

ఎస్బీఐ ఏటీయం నుంచి రెండు వేల రూపాయల నకిలీ నోట్లు

Posted: 02/22/2017 09:27 PM IST
Fake rs 2000 notes from children bank of india at delhi sbi atm

అవసరం కొద్ది బ్యాంకు ఏటీయంకు వెళ్లి డబ్బులు డ్రా చేసిన యువకుడు.. తనకు వచ్చిన నోట్లు కొంచెం తేడాగా వున్నాయని గుర్తించి.. బిత్తరపోయాడు. కొత్తగా వచ్చిన రెండు వేల రూపాయల నోట్లకు నకిలీ నోట్లను తయారు చేయడం మన దాయాది పాకిస్తాన్ వల్ల కూడా సాధ్యం కాదని ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు కేంద్రమంత్రులు కూడా ధీమాను వ్యక్తం చేసినా.. ఇంటి దోంగలే అసలుకు నకిలీని తయారు చేసి చలామణిలోకి తీసుకోస్తున్నారు. అందునా ఏటీయం కేంద్రాలలో ఈ నోట్లు వస్తుండటంతో వాటిని డ్రా చేసిన వారు నష్టపోవాల్సి వస్తుంది.

ఫిబ్రవరి ఆరవ తేదీన ఈ ఘటన ఢిల్లీలోని సంఘం విహార్‌లో గల ఎస్బీఐ ఏటీఎంనుంచి ఈ నోట్లు రావడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఒరిజినల్‌ నోటుపై ఎలాంటి అక్షరాలను ఉపయోగించారో అచ్చం అలాంటివే దొంగనోట్ల ముద్రణకు వాడారని, వాటర్‌ మార్క్‌ వద్ద చురాన్‌ పట్టి అని రాసి ఉందని, మిగితా అన్ని అంశాలు కూడా ఆర్బీఐ మాదిరిగానే ముద్రించారని ఆ వ్యక్తి తెలిపాడు. రిజర్వ్ బ్యాంక్ అని ముద్రించాల్సిన చోట చిల్డ్రన్స్ బ్యాంక్ అని ఉంది. సీరియల్ నెంబర్ ఉండాల్సిన చోట అన్నీ సున్నాలే కనిపించాయి. అసలు రూపాయి గుర్తే మాయం అయింది.
 
మూడు సింహాలు ఉండాల్సిన చోట చూరణ్ లేబుల్ అని ఆంగ్లంలో ముద్రించి ఉంది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం కనిపించడం లేదు. నోట్ల మీద హిందీలో భారతీయ మనోరంజన్ బ్యాంక్ అని ముద్రించి ఉంది. 2వేల రూపాయలు ఇస్తామని ముద్రించి ఉండాల్సిన చోట.. 2వేల కూపన్లు అని ముద్రించి ఉంది. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ అని ఉండాల్సిన చోట పిల్లల ప్రభుత్వం గ్యారంటీ అని ముద్రించి ఉంది. ఆర్బీఐ స్టాంప్ ఉండాల్సిన చోట పీకే అని ముద్రించి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమ వైపు నుంచి విచారణ జరుగుతుందని ఆర్బీఐ ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles