స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుబంధంగా నడుస్తున్న ఐదు బ్యాంకుల పేర్లు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మారుబోతేున్నాయి. అదేంటి ఏప్రిల్ పస్ట్ రోజున పేర్ల మార్పా..? అంటే ఇప్పటినుంచి ఏప్రిల్స్ 1న ఫూల్స్ డే రోజున ఫూల్ చేయడానికి రెడీ అవుతున్నారా ..? అనుకుంటే పోరబాటే. ఎందుకంటే ఇది ముమ్మాటికీ నిజం. స్టేట్ బ్యాంకు అప్ ఇండియాలో అయిదు అనుబంధ బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1 అమల్లోకి రానుంది. ఏప్రిల్ 1 నుంచి అయిదు అసోసియేట్ బ్యాంకులు మాతృ సంస్థ ఎస్బీఐలో పూర్తిగా విలీనం కానున్నాయని ఎస్బీఐ రెగ్యులేటరీ ఫైలింగ్ లోతెలిపింది. 2017 ఏప్రిల 1 నుంచి ఇవి ఎస్బీఐ మారతాయని తెలిపింది.
గత ఏడాదినుంచి వార్తల్లో ఈ విలీన ప్రక్రియ ఎట్టకేలకు కార్యరూపంలోకి రానుంది. ఈ విలీనం తరువాత డైరెక్టర్లు, అసోసియేట్ బ్యాంకుల ఎగ్జిక్యూటివ్ ధర్మకర్తలమండలి మినహా, బ్యాంకుల సిబ్బంది, అధికారులు ఎస్బీఐ పరిధిలోకి వస్తారు. వీరి జీతాలలో ఎలాంటి మార్పులు ఉండవు. అలాగే ఈ విలీన ప్రక్రియ ముగిసిన తరువాత అసోసియేట్ బ్యాంకులు ఎస్బీబీజే, ఎస్బీఎం, ఎస్బీటీ షేర్లను స్టాక్మార్కెట్ల నుంచి తొలగించనున్నారు.
స్టేట్ బ్యాంకు ఆఫ్ బికానూర్ & జైపూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అసోసియేట్ బ్యాంకుల విలీనానికి ఈ నెల 16న కేబినెట్ తుది ఆమోదం లభించింది. గత ఏడాది మేలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ బ్యాంకు ఈ విలీన ప్రతిపాదనకు స్వాప్ రేషియో ఆధారంగా ఆగస్టులో ఆమోదం లభించింది. అయితే భారతీయ మహిళా బ్యాంకును కూడా ఎస్బీఐ విలీనం చేయాలనే ప్రతిపాదనపై నిర్ణయంఇంకా పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more