క్రమశిక్షణ, కఠోర శిక్షణకు అలవాలైమైన భారత రక్షణ రంగానికి చెందిన అర్మీలో కూడా లీకుల పరంపర వెలుగుచూసింది. ఆర్మీలో పలు ఉద్యోగాల నియామకాలకు ఆదివారం నిర్వహించాల్సిన ప్రశ్నా పత్రం లీక్ అయింది. దీనికి సంబంధించి పుణె, నాగ్పూర్, నాసిక్ లకు చెందిన 300 మంది విద్యార్థులను, 18 మంది నిందితులను థానె పోలీసులు అరెస్టు చేశారు. పుణెలో ప్రశ్నా పత్రం లీక్ అయినట్టు గుర్తించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆర్మీ ఉద్యోగాల నియామకాల పరీక్షలను రద్దు చేశారు.
ఈ రోజు తెల్లవారుజామున సుమారు 350మంది విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు ప్రశ్నాపత్రాన్ని అమ్మాయి. ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.2లక్షలు వసూలు చేశారు. పక్కా సమాచారాన్ని అందుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. పలు కోచింగ్ సెంటర్ల యాజమానులను, ఆర్మీ ఉద్యోగులను అరెస్టు చేసినట్లు థానె క్రైం బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నితిన్ ఠాక్రే తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రశ్నాపత్రం లీక్ చేసిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్మీ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసినట్టు పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more