అగ్రరాజ్యం అమెరికాలో జాతి వైషమ్యం తలకెక్కిన ఓ దుర్మార్గుడు విద్వేషపూరితంగా కాల్పులకు తెగబడటంతో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్ వాసీ శ్రీనివాస్ బౌతికఖాయానికి రాజకీయ నేతలు, ప్రముఖులు ఘననివాళులు అర్పించారు. ఆయన అంతిమయాత్రంలో పాల్గోన్న ప్రముఖులు కన్నీటితో వీడ్కోలు పలికారు. అగ్రరాజ్యంగా బాసిల్లుతున్న అమెరికాలో జాతి వైర్యం పేట్రేగిపోవడం పలువురు ఎన్ఆర్ఐ తల్లిదండ్రులను కూడా తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. క్రితంరోజు రాత్రి శ్రీనివాస్ మృతదేహం హైదరాబాద్కు చేరుకుంది. అమెరికా నుంచి సాయంత్రం ముంబైకి చేరిన మృతదేహాన్ని రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టుకు తీసుకొచ్చారు. మృతదేహం వెంట ఆయన భార్య సునయన వచ్చారు.
విమానాశ్రయంలో ఆయన మృతదేహానికి తెలంగాణ రవాణా మంత్రి మహేందర్రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, కుత్బుల్లాపుర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నివాళులర్పించారు. అక్కడి నుంచి అంబులెన్స్ లో మల్లంపేటలోని నివాసానికి తీసుకురాగా, కొడుకు మృతదేహాన్ని చూసి తండ్రి మధుసూదన్, తల్లి వర్షిణి కుప్పకూలిపోయారు. బంధువులు బోరున విలపించారు. ఈ సమయంలో వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.
కాగా ఇవాళ శ్రీనివాస్ అంతిమయాత్ర కోనసాగుతున్న నేపథ్యంలో నగరంలోని పలువురు ఎన్ఆర్ఐ తల్లిదండ్రుల కుటుంబాలతో పాటు రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు బాచుపల్లి మల్లంపేటలోని శ్రీనివాస్ నివాసానికి చేరుకుని ఘన నివాళులు అర్పించారు. దీంతో శ్రీనివాస్ వివాస పరిసర ప్రాంతమంతా విషాధఛాయలు అలుముకున్నాయి. అ తరువాత శ్రీనివాస్ అంతిమ యాత్రలో వారు పాల్లోని కన్నీటి వీడ్కోలు పలికారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more