ఆ ముఖ్యమంత్రి తలను నరికిన వారికి కోటి రూపాయల సుపారీని ఇచ్చేందుకు సిద్దమయ్యాడు ఓ ఆరెస్సెస్ నేత. నేతలు విమర్శల స్థాయి నుంచి ఏకంగా సంచలనాల కోసం దారుణ వ్యాక్యలకు కూడా పాల్పడుతున్నారు. ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయాలన్న విజ్ఞతను మర్చిపోయి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనాలకు తెరతీస్తున్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట అంటున్నారు. భారతదేశంలో ఇలాంటి చౌకబారు రాజకీయాలకు అధరణ వుండదని తెలిసినా.. సంచలనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలను చేస్తున్నారు. ఇక కేంద్ర, రాష్ట్రాలలో తమ ప్రభుత్వాలు అధికారంలో వున్నాయంటే ఆ నేతల నోటికి అడ్డుఅదుపు వుండదని ఈ ఘటన రుజువు చేస్తుంది.
మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో డాక్టర్ కుందన్ చంద్రావత్ అనే ఆరెస్సెస్ నాయకుడు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశాడు. ఆ తరువాత ఇరకాటంలో పెట్టాయి. లెఫ్ట్ పార్టీలపై విషం కక్కాడు. కేరళ సీఎం విజయన్ తలను తీసుకొచ్చే వారికి బహిరంగంగానే సుపారీ ప్రకటించాడు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తల నరికి తీసుకొచ్చిన వారికి కోటి రూపాయల విలువైన తన ఇంటితో పాటు తన ఆస్తులను కూడా ఇస్తానని ప్రకటించాడు. తాను ఓ నేత అన్న విషయాన్ని మర్చిపోయి.. ఓ మాఫియా డాన్ లా ఈ ఆఫర్ ప్రకటించాడు.
కొంతకాలంగా కేరళలో అరెస్సెస్, సీపీఎం నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. హత్య రాజకీయాల వరకు పరిస్థితి వెళ్లింది. పినరయి విజయన్ అధికారంలోకి వచ్చాక ఎనిమిది మంది RSS నేతలు హత్యకు గురయ్యారనేది ఆర్ఎస్ఎస్ ఆరోపణ. కేరళ రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఓచోట అరెస్సెస్ వర్సస్ సీపీఎం మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే.. సీఎం విజయన్ ఓ సభలో మాట్లాడుతూ.. దేశాన్ని చీల్చేందుకు అరెస్సెస్ ప్రయత్నిస్తోందన్న విమర్శలు చేశారు. హిట్లర్, ముస్సోలిని వంటి డిక్టేటర్ లా అరెస్సెస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిట్లర్, ముస్సోలిని ప్రపంచాన్ని ఏలాలనే దురుద్ధేశంతో.. నియంతల్లా వ్యవహరించారన్నారు. మహాత్మా గాంధీ హత్య వెనక కూడా అరెస్సెస్ సంస్థ హస్తం ఉందని ఘాటుగా స్పందించారు. కేరళ సీఎం ఈ వ్యాఖ్యల తర్వాత.. అరెస్సెస్ నేతలు ఆయనపై మరింత దూకుడు పెంచారు. ఈక్రమంలోనే ఉజ్జయినిలోని ఓ సభలో అరెస్సెస్ నేత కుందన్ చంద్రావత్ మాట్లాడుతూ.. కేరళ సీఎం తలకు కోటి రూపాయల వెల కట్టారు. ఈ వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎందరి తలలనో ఆరెస్సెస్ తీసుకుంది..
మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన డాక్డర్ కుందన్ చంద్రావత్ అనే అరెస్సెన్ నాయకుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన కేరళ సీఎం విజయన్ కూడా అంతే ఘాటుగా సమాధానమిచ్చారు. ఆర్ఎస్ఎస్ ఇప్పటికే ఎంతో మంది తలలను తీసుకుందని అన్నారు. అయితే అరెస్సెస్ తీసుకున్న తలలను వారు కూడా లెక్కించి వుండరని, అయితే చంద్రావత్ అరెస్సెస్ చేస్తున్న నిజాలను వెల్లడించారని అన్నారు. కాగా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.. చంద్రావత్ వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more