కేజ్రీవాల్ కు ఏమైంది..? ట్విట్టర్ పై గుస్సా ఎందుకు.? AAP accounts suspended, Kejriwal complains about it to twitter

Aap accounts suspended kejriwal complains about it to twitter

Arvind Kejriwal, Aam Aadmi Party, Aap suspension, Aap twitter accounts, aap twitter account suspension, aam aadmi party twitter suspension, kejriwal vs twitter, kejriwal twitter, arvind kejriwal

Delhi Chief Minister Arvind Kejriwal has hit out at the social media website Twitter for suspending accounts of Aam Aadmi Party and its supporters.

కేజ్రీవాల్ కు ఏమైంది..? ట్విట్టర్ పై గుస్సా ఎందుకు.?

Posted: 03/04/2017 10:58 AM IST
Aap accounts suspended kejriwal complains about it to twitter

ఆమ్ అద్మీ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈ సారి ఆయనకు షాక్ ఇచ్చింది ఎవరో వ్యక్తులు కాదు.. ప్రపంచవ్యాప్తంగా తన ఉనికి చాటుకున్న సామాజిక మాద్యమంగా పేరొందిన సంస్థ. అదేనండీ ట్విట్టర్. ట్విట్టర్ ఇండియా నుంచి షాక్ ఎదురుకావడంతో ఏకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీనిపై స్పందించారు. తమ పార్టీకి సంబంధించిన సమాచారాన్ని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు వెనువెంటనే తెలియజేసేందుకు వినియోగిస్తున్న ఆఫ్ ఇన్ న్యూస్ అనే అకౌంట్ ను సస్సెండ్ ట్విట్టర్ సస్పెండ్ చేసింది.

కాగా ఈ విషయమై అప్ ఇన్ న్యూస్ అకౌంట్ ఇంచార్జీగా వ్యవహరిస్తున్న పార్టీ నాయకుడు జితేందర్ సింగ్ ట్వీట్ చేసి తమ పార్టీ మద్దతుదారులకు విషయాన్ని తెలిపాడు. జితేందర్ సింగ్ ట్వీట్ పై ప్రస్తావిస్తూ తమను ట్విట్టర్ ఎందుకు టార్గెట్ చేసిందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. అయితే దీనికి ట్విట్టర్ ఇండియా మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో కేజ్రీవాల్ కూడా ట్విట్టర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్ ఇండియాకు ఏమైందని ప్రశ్నించారు. తమ అకౌంట్లను సస్పెండ్ చేయడం వెనుకు అంతర్యమేమిటని ప్రశ్నించారు.
 
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ట్విట్టర్ అకౌంట్లు ఒక్కోదాన్నీ నెమ్మదిగా సస్పెండ్ చేస్తూ వస్తున్న విధానాన్ని ఆయన తప్పుబట్టారు. కేవలం తమ పార్టీకి చెందిన అకౌంట్లను, తమ పార్టీ మద్దతుదారుల అకౌంట్లను మాత్రమే సస్పెండ్ చేస్తుందా..? లేక ఇతర పార్టీ అకౌంట్లను, వాటి మద్దతుదారుల అకౌంట్లను కూడా సస్పెండ్ చేస్తున్నారా..? అన్న ప్రశ్నలు కూడా అప్ వర్గ నేతల నుంచి వినిపిస్తున్నాయి. సోషల్ మీడియానే ఆయుధంగా చేసుకుని ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉండటంతో.. ఇప్పుడు అదే సోషల్ మీడియాకు దూరం కావడం కేజ్రీవాల్‌ను చాలా ఇబ్బంది పెడుతోంది. ఇదిలావుండగా ట్విట్టర్ ఇండియా కూడా కేంద్రం ఒత్తిళ్లకు తలొగ్గి తమ అకౌంట్లను సస్సెండ్ చేస్తుందన్న అరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : arvind kejriwal  aam admi party  twitter accounts  suspended  aap in news  social media  

Other Articles