ఆ నటుడికి అదే అంతిమ డైలాగ్ అయ్యింది.. Marathi theatre actor dies while performing on stage

Marathi actor sagar shantaram dies on stage after suffering cardiac arrest

sagar shantaram chougule, sagar chougule, sagar chougule death, sagar chougule marathi actor, marathi actor sagar chougule, sagar chougule pune, sagar chougule actor, sagar chougule news, sagar chougule age, sagar marathi actor, pune news, sagar marathi actor death, entertainment news

In an unfortunate incident, Marathi actor Sagar Shantaram Chougule died during a theatre performance after suffering a heart attack. He was 38. The actor was in the midst of a dialogue when he suddenly fainted on stage.

ఆ నటుడికి అదే అంతిమ డైలాగ్..

Posted: 03/04/2017 12:44 PM IST
Marathi actor sagar shantaram dies on stage after suffering cardiac arrest

ప్రేక్షకుల కరతాళధ్వనులనే అస్తులుగా పరిగణించుకుంటూ, తమకు వచ్చిన అవార్డులు కడుపు నింపకపోయినా.. వాటినే చూస్తు మురిసిపోతే.. మరింత మెరుగ్గా నటించాలన్న తపన, కసితో ఎందరో కళాకారులు వెలుగులోకి రాకుండానే అస్తమిస్తున్నారు. సినీమాయా ప్రపంచం నాటక రంగాన్ని అణిచివేసినా.. ఇంకా ఆ రంగాన్నే నమ్ముకుంటూ నాటకాలను వేస్తున్న కళాకారుల సంఖ్య ఏ మాత్రం తక్కువ కాదు. కట్ కట్ అంటూ సాగే సినిమాల కన్నా.. ఒక డైలాగ్ ను ఎత్తుకుంటే.. దానిని పూర్తి చేసే వరకు ఆ సన్నివేశానికి సంబంధించిన ప్రాత్ర చెప్పినట్లుగా అబినయాన్ని ప్రదర్శిస్తూ, డైలాగ్ పూర్తి చేయాలన్న తాపత్రయపడుతూ ఓ కళాకారుడు తన తుదిశ్వాసను విడిచాడు.

వారసత్వంగా వచ్చిన నాటక కళ ప్రదర్శనను అందిపుచ్చుకుని తనకు కళల పట్ల వున్న మక్కువ కూడా కలబోసి రాజసం వుట్టిపడే రాజుపాత్రను పోషిస్తూ.. రాజు అనగానే అంతటి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ.. అంతట రాజుల మాదిరిగానే డైలాగులను డెలివరీ చేస్తూ.. అదే తన జీవితానికి అంతిమ డైలాగ్ గా చేసుకున్నాడు మరాఠీ కళాకారుడు. సాగర్ శాంతారామ్ చౌగ్లే (38) అనే ఈ కళాకారుడు.. పుణెలో స్టేజి మీద నాటకంలో డైలాగు చెబుతూ ఉండగానే కుప్పకూలిపోయాడు. నాటకాన్ని అడుతూనే ప్రాణాలను విడిచాడు. అతడిని తోటి కళాకారులు, ప్రేక్షకులు కలిసి వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికపే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
 
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన సాగర్‌కు పెళ్లయ్యి, ఒక కుమార్తె కూడా ఉంది. అతడి మృతదేహాన్ని స్వస్థలమైన కొల్హాపూర్‌కు తరలిస్తున్నారు. పుణెలో నాటక కళాకారులు స్టేజిమీద ప్రదర్శన ఇస్తూ మరణించడం ఇది రెండోసారి. ప్రముఖ మరాఠీ నటి, నృత్య కళాకారిణి అశ్వినీ ఏక్‌బోతే కూడా గత సంవత్సరం అక్టోబర్‌లో పుణెలోని భారత నాట్యమందిర్ వేదిక మీద ప్రదర్శన ఇస్తూ మరణించారు. నాటకాల పోటీలో పాల్గొనేందుకు సాగర్, అతడి బృందం పుణెకు వచ్చారు. వాళ్లు 'అగ్నిదివ్య' అనే నాటకం ప్రదర్శిస్తున్నారు. ప్రముఖ సంఘసంస్కర్త సాహు మహరాజ్ జీవిత కథ ఆధారంగా ఈ నాటకాన్ని రూపొందించారు. అందులో సాగర్ సాహు మహరాజ్ పాత్రను పోషిస్తున్నాడు. సాగర్ తండ్రి కూడా గతంలో మరాఠీ నాటకాలు, సినిమాలలో నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles