కేసీఆర్ ను కలసి థ్యాంక్స్ చెప్పిన మోత్కుపల్లి.. మొదలైన రాజకీయ చర్చ mothkupalli narsimlu meets cm kcr, says no political importance

Mothkupalli narsimlu meets cm kcr says no political importance

Mothkupalli Narsimlu, K Chandra Shekar Rao, CM camp office, Begaumpet, Niharika, Marriage, Yadadri district, Mothkupalli, kcr, polical change, Telangana

mothkupalli narsimlu meets telangana cm kcr at camp office, says no political importance except inviting him to his daughter marriage

కేసీఆర్ ను కలసి థ్యాంక్స్ చెప్పిన మోత్కుపల్లి.. మొదలైన రాజకీయ చర్చ

Posted: 03/11/2017 03:21 PM IST
Mothkupalli narsimlu meets cm kcr says no political importance

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసారు, వీరిద్దరి కలయికకు కారణాలు ఏదైనా.. వీరిద్దరి చర్చ మాత్రం ఖచ్చితంగా రాజకీయాలలో మార్పులు తీసుకువస్తుందని అంటున్నారు విశ్లేషకులు. టీఆర్ఎస్ ఉద్యమం ప్రారంభం నుంచి ఉప్పు-నిప్పులా వున్న కేసీఆర్, మోత్కుపల్లి ఏకాంతంగా చర్చలు జరపడంపై కూడా పలు సందేహాలకు దారితీస్తుంది. టీడీపీలో నుంచి రాజ్యసభ టిక్కెట్ అశించి భంగపడిన మోత్కుపల్లి చివరికి గవర్నర్ గిరి కోసం కోసం గత మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే కేవలం ఆంద్రప్రదేశ్ పై మాత్రమే దృష్టి సారించిన చంద్రబాబు తెలంగాణను , స్థానిక నేతలను పట్టించుకోకపోవడంతో ఆయన గత కొంతకాలంగా మౌనముద్రలో మునిగిపోయారు.

కాగా, తన కుమార్తె నిహారిక వివాహానికి హాజరుకావాలని లగ్నపత్రిక అందజేశారు. తెలుగుదేశం ఆవిర్భావంలో ఒకే పార్టీలో అత్యంత ప్రియమిత్రులుగా ఉన్న మోత్కుపల్లి, కేసీఆర్‌ సుదీర్ఘ విరామం తర్వాత వివాహ పత్రిక సందర్భంగా కలవడం అత్యంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. లగ్నపత్రికతో తన నివాసం ప్రగతిభవన్ కు వచ్చిన చిరకాల మిత్రులు మోత్కుపల్లిని కేసీఆర్‌ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఉన్నవారందరినీ బయటకు పంపించి సుమారు గంటన్నరపాటు పలు అంశాలపై ఇరువురూ   చర్చించారు.
 
ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఈ ఇద్దరు నేతలు తమ గత స్మృతులను నెమరేసుకున్నారు. ఆమె పెళ్లికి ఖచ్చితంగా వస్తానని సీఎం మోత్కుపల్లికి మాట ఇచ్చారు. అలాగే తన కోరికను మన్నించి యాదాద్రిభువనగిరి జిల్లాను ప్రకటించినందుకు కేసీఆర్‌కు మోత్కుపల్లి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆలేరు నియోజకవర్గానికి సాగు నీరందించేందుకు మల్లన్నసాగర్‌లో చేపట్టిన బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్‌లు పూర్తచేయాలని కోరినట్లు తెలిసింది. కాగా వీరి కలయికపై   రాజకీయంగా చర్చ మొదలైంది. కాగా ఇదే విషయంపై మోత్కుపల్లిని ప్రశ్నించగా తాను తన కుమార్తె వివాహానికి లగ్నపత్రిక అందించడానికి వెళ్లానే తప్ప ఎలాంటి రాజకీయాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles