గోవా, మణిపూర్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగాయి. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ, బీజేపీ అధికారం ఏర్పాటు చేసే దిశగా పావులు కదిపింది. దీనిపై కాంగ్ అభ్యంతరాలు లేవనెత్తుతోంది. ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత, రక్షణ మంత్రి(మాజీ) మనోహర్ పారికర్ మరోసారి పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. గోవాలో 17 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కూడగట్టుకోవడంలో విఫలమైంది. 13 స్థానాలు గెలుచుకున్నా ఎంజీపీ, జీఎఫ్‌పీ, ఎన్సీపీ, స్వతంత్రుల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ముందుకొచ్చింది.
వివాదాస్పద రహితుడుగా ఉన్న పారికర్‌ను ముఖ్యమంత్రిగా నియమించాలనే షరతుతోనే బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు జీపీఎఫ్, ఎంజీపీలు తెలిపాయి. దీంతో రక్షణమంత్రిగా ఉన్న పారికర్ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్ మృదులా సిన్హాను కలిసిన పారికర్ 21 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అందజేశారు. దీంతో ఆయనను ముఖ్యమంత్రిగా నియమిస్తూ ఆదివారం బాగా పొద్దుపోయాక గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. పారికర్ ప్రమాణ స్వీకారం చేశాక 15 రోజుల్లోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది.
మణిపూర్ లోనూ అదే సీన్...
మణిపూర్ లో కూడా సేమ్ సీన్ రిపీట్ కాబోతుంది. అక్కడ కాంగ్రెస్ తో పొలిస్తే బీజేపీకి 7 సీట్లు తక్కువ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 31 సీట్లు అవసరం. 10 సీట్ల వెనుకబాటు అయితేనేం మణిపూర్ గద్దెపై కాషాయ జెండా రెపరెపలాడబోతోంది. బీజేపీకి మద్దతిస్తున్నట్లు నలుగురు ఎమ్మెల్యేలున్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ), ఒక ఎమ్మెల్యే ఉన్న లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) ఆదివారం ప్రకటించాయి. ఎన్‌పీపీ, ఎల్‌జేపీలతో అవగాహన కుదిరిందని.. మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని బీజేపీ ప్రధాన కార్యదర్శి (బీజేపీ మణిపూర్ వ్యవహారాల బాధ్యుడు) రామ్ మాధవ్ వెల్లడించారు.
వారి చేరికతో బీజేపీ బలం 26కు చేరుకుంది. కాగా, ఎన్‌డీఏలో భాగస్వామ్యపక్షంగా ఉన్న నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) కూడా మణిపూర్‌లో బీజేపీకే మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రసక్తేలేదని స్పష్టం చేసింది. దీనికి తోడు ఓ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతుగా నిలిచారు.
వీరంతా ఆదివారం రాత్రి గవర్నర్ నజ్మా హెప్తుల్లాను కలిశారు. ‘60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ బలం 32కు చేరింది. 11 మంది స్వతంత్ర సభ్యులు బీజేపీకి మద్దతు పలికారు’ అని గవర్నర్‌ను కలిసిన తర్వాత బీజేపీ నేత, అస్సాం మంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ పక్షనేతగా ఎంపికైన ఇబోబీ సింగ్ నేడు గవర్నర్ ను కలవటం చర్చనీయాంశంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more